ప్రధాన మంత్రి కార్యాలయం
బెల్జియం ప్రధానిగా శ్రీ బార్ట్ డీ వేవర్ పదవీబాధ్యతలు.. ప్రధానమంత్రి అభినందనలు
Posted On:
04 FEB 2025 9:00AM by PIB Hyderabad
బెల్జియం ప్రధాని గా శ్రీ బార్ట్ డీ వేవర్ పదవీబాధ్యతలను స్వీకరించిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు ఈ రోజు అభినందనలు తెలిపారు. భారత్-బెల్జియం సంబంధాల్ని మరింత బలపర్చుకోవడానికి, ప్రపంచ అంశాలపై సహకారాన్ని పెంపొందింపచేసుకోవడానికి ఇద్దరం కలిసి పనిచేస్తామన్న విశ్వాసం తనకు ఉందని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు :
‘‘ప్రధాని శ్రీ బార్ట్ డీ వేవర్ (@Bart_DeWever) .. మీరు పదవీబాధ్యతల్ని స్వీకరించిన సందర్బంగా మీకు నా హృదయపూర్వక అభినందనలు. భారత్-బెల్జియం సంబంధాల్ని మరింత పటిష్టపర్చుకోవడంతోపాటు ప్రపంచ అంశాల్లో మన సహకారాన్ని పెంపొందింపచేసుకోవడానికి మనం కలిసి పనిచేయాలని నేను ఆశిస్తున్నాను. మీ భావి పదవీకాలం ఫలప్రదం కావాలని కోరుకుంటూ, మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.’’
***
MJPS/SR
(Release ID: 2099424)
Visitor Counter : 34
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali-TR
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada