ప్రధాన మంత్రి కార్యాలయం
పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించిన రాష్ట్రపతి గారి నేటి ప్రసంగం వికసిత భారత్ దిశగా దేశం పయనిస్తున్న తీరును ప్రతిబింబించిది: ప్రధాని
అభివృద్ధి దిశగా యువతకు దేశంలో అత్యుత్తమ అవకాశాలున్నాయి.. రాష్ట్రపతి ప్రసంగం భారత దార్శనికతను ధ్వనిస్తోంది: ప్రధాని
प्रविष्टि तिथि:
31 JAN 2025 2:43PM by PIB Hyderabad
పార్లమెంటు ఉభయసభలనుద్దేశించి గౌరవ రాష్ట్రపతి ప్రసంగాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. వికసిత భారత్ దిశగా భారత ప్రస్థానంపై సమగ్ర దార్శనికతను ఆమె ప్రసంగం ఆవిష్కరించిందన్నారు.
రంగాలవారీగా కీలక కార్యక్రమాలను, సర్వతోముఖాభివృద్ధితో పాటు భవిష్యత్ అభివృద్ధి ప్రాధాన్యాన్ని గౌరవ రాష్ట్రపతి ప్రముఖంగా ప్రస్తావించారని శ్రీ మోదీ అన్నారు.
భారత్ దార్శనికతకు రాష్ట్రపతి ప్రసంగం అద్దం పడుతోందని, యువత అభివృద్ధి చెందడానికి దేశంలో అత్యుత్తమ అవకాశాలున్నాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
దశాబ్ద కాలంగా మన దేశం సాధించిన సమష్టి విజయాలను గౌరవ రాష్ట్రపతి తన ప్రసంగంలో సంగ్రహంగా అద్భుతంగా వివరించారని, మన భవిష్యత్ ఆకాంక్షలను కూడా వెల్లడించారని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి గారి నేటి ప్రసంగం.. వికసిత భారత్ దిశగా మన దేశం పయనిస్తున్న తీరును ప్రతిధ్వనించింది. అన్ని రంగాల్లో కీలక కార్యక్రమాలను రాష్ట్రపతి ప్రముఖంగా పేర్కొన్నారు. ఆమె ప్రసంగం సర్వతోముఖ, భవిష్యత్తు అభివృద్ధి ప్రాధాన్యాన్ని చాటింది.
యువత అభివృద్ధి చెందడానికి అత్యుత్తమ అవకాశాలను అందిస్తున్న భారత దార్శనికతకు ఆమె ప్రసంగం అద్దం పడుతోంది. ఐక్యత, దృఢ సంకల్పంతో మనం నిర్దేశించుకున్న లక్ష్యాల సాధన కోసం స్ఫూర్తిదాయకమైన ప్రణాళిలను కూడా తన ప్రసంగంలో పొందుపరిచారు.”
“దశాబ్ద కాలంగా మన దేశం సాధించిన సమష్టి విజయాలను తన ప్రసంగంలో సంగ్రహంగా అద్భుతంగా వివరించిన రాష్ట్రపతి.. భవిష్యత్ ఆకాంక్షలనూ పేర్కొన్నారు. ఆర్థిక సంస్కరణలు, మౌలిక సదుపాయాల అభివృద్ధితోపాటు ఆరోగ్య రక్షణ, విద్య, పునరుత్పాదక ఇంధనం, గ్రామీణాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం, అంతరిక్షం, తదితర అంశాలనూ రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించారు.”
****
(रिलीज़ आईडी: 2098402)
आगंतुक पटल : 65
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Tamil
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam