ప్రధాన మంత్రి కార్యాలయం
మెట్రో సంధానాన్ని పెంచడంలో, పట్టణ రవాణాను బలపరచడంలో పనులు విస్తృత స్థాయిలో జరిగాయి: ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
05 JAN 2025 11:18AM by PIB Hyderabad
భారతదేశం నలుమూలలా మెట్రో సంధానాన్ని (కనెక్టివిటీ) మెరుగుపరచడంలో ప్రశంసనీయ పురోగతి చోటు చేసుకొందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో రవాణా రూపురేఖలను మార్చివేయడంలోనూ, లక్షలాది పౌరులకు ‘జీవన సౌలభ్యాన్ని’ మెరుగుపరచడంలోనూ మెట్రో సంధానానిది కీలక పాత్ర అని కూడా ఆయన అన్నారు.
మన దేశంలో చోటుచేసుకొన్న మెట్రో విప్లవాన్ని గురించి మైగవ్ (MyGov) సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పొందుపరిచిన కొన్ని సందేశాలకు ప్రధాని శ్రీ మోదీ సమాధానాన్నిస్తూ, ఇలా పేర్కొన్నారు:
‘‘గత పదేళ్లలో, మెట్రో సంధానాన్ని పెంచడానికి విస్తృత స్థాయిలో పనులు జరిగాయి, ఈ విధంగా పట్టణ ప్రాంతాల్లో రవాణా సదుపాయాల్ని బలపర్చడంతోపాటు ‘జీవన సౌలభ్యాన్ని’ పెంపొందించారు.
#MetroRevolutionInIndia”
*********
MJPS/ST
(रिलीज़ आईडी: 2090382)
आगंतुक पटल : 80
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam