ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కృత్రిమ మేధ రంగంలో నాయకత్వం వహించడానికి భారత్ కంకణం కట్టుకొంది: ప్రధానమంత్రి


ప్రధానితో భారతీయ ఔత్సాహిక పారిశ్రామికవేత్త శ్రీ విశాల్ సిక్కా సమావేశం

प्रविष्टि तिथि: 04 JAN 2025 2:42PM by PIB Hyderabad

భారతదేశ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్లో ఒకరైన శ్రీ విశాల్ సిక్కా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలుసుకొన్నారు. ఈ సమావేశం చక్కని ఆలోచనల్ని ఒకరికొకరు తెలియజెప్పుకోవడానికి వేదికైందంటూ శ్రీ మోదీ అభివర్ణించారు. కృత్రిమ మేధ (ఆల్టర్నేటివ్ ఇంటెలిజెన్స్.. ఏఐ) రంగంలో నాయకత్వ పాత్రను పోషించడానికి భారత్ కట్టుబడి ఉందనీ, ఈ క్రమంలో నవకల్పన (ఇన్నొవేషన్)పైనా, యువతకు అవకాశాలను అందించడంపైనా దృష్టిని కేంద్రీకరిస్తోందనీ ఆయన అన్నారు. ఏఐని గురించీ, భారత్‌పై ఏఐ చూపే ప్రభావాన్ని గురించీ, రాబోయే కాలంలో చేపట్టాల్సిన పనులను గురించీ ఇరువురూ విస్తృతంగా చర్చించారు.  

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ విశాల్ సిక్కా నమోదు చేసిన ఒక సందేశానికి ప్రధాని సమాధానాన్నిస్తూ మరో సందేశంలో ఇలా పేర్కొన్నారు:
“ఇది నిజానికి సిసలైన చర్చే. నవకల్పనపైనా, యువతీయువకులకు అవకాశాలను అందించడంపైనా శ్రద్ధ తీసుకొంటూ, ఏఐ రంగంలో అగ్రగామిగా నిలవాలని భారత్ కంకణం కట్టుకొంది.’’

********

 MJPS/ST


(रिलीज़ आईडी: 2090381) आगंतुक पटल : 84
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam