హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి ప్రగాఢ సంతాపం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం


26 నుంచి ఏడు రోజుల పాటు దేశవ్యాప్తంగా సంతాప దినాలుగా పాటించాలని నిర్ణయం

దివంగత డాక్టర్ సింగ్ కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

प्रविष्टि तिथि: 27 DEC 2024 3:05AM by PIB Hyderabad

మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఢిల్లీలోని ఎయిమ్స్ లో గురువారం కన్నుమూశారని కేంద్ర ప్రభుత్వం తీవ్ర విచారంతో ప్రకటించింది.

దివంగత మాజీ ప్రధానమంత్రికి నివాళిగా, ఆయన గౌరవార్థం ఈ నెల 26 నుంచి వచ్చే నెల ఒకటో తేదీ వరకు దేశమంతటా సంతాప దినాలుగా పాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా జాతీయ పతాకాన్ని రోజూ ఎగురవేసే చోట్ల ఈ సమయంలో జెండాను సగానికి అవనతం చేస్తారు. సంతాప సమయంలో ఎటువంటి అధికారిక వేడుకలూ జరగవు. దివంగత డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరుగుతాయి.

విదేశాల్లోని అన్ని భారత రాయబార కార్యాలయాలు/ హైకమిషన్లలో అంత్యక్రియల రోజున జాతీయ పతాకాన్ని సగానికి అవనతం చేస్తారు.  

***


(रिलीज़ आईडी: 2088397) आगंतुक पटल : 92
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Tamil , English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Kannada , Malayalam