ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నీతి ఆయోగ్‌లో ప్రముఖ ఆర్థికవేత్తలతో ప్రధాని సమావేశం


సమావేశ ఇతివృత్తం: అంతర్జాతీయ అనిశ్చితుల సమయంలో భారతదేశ వృద్ధి వేగాన్ని కొనసాగించడం

2047 నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే దిశగా ఆలోచనా విధానాన్ని మార్చుకోవడం ద్వారా వికసిత భారత్‌ను సాధించవచ్చు: ప్రధాని

ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, పెట్టుబడులను ఆకర్షించడం, ఎగుమతులకు ఊతమివ్వడం సహా తదితర అంశాలపై విస్తృతంగా చర్చించిన ఆర్థికవేత్తలు

Posted On: 24 DEC 2024 6:47PM by PIB Hyderabad

2025-26 కేంద్ర బడ్జెట్‌కు సన్నాహకంగా ప్రముఖ ఆర్థికవేత్తలుమేధావులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నీతి ఆయోగ్‌లో మంగళవారం చర్చించారు.

అంతర్జాతీయ అనిశ్చితుల వేళ భారత వృద్ధి వేగాన్ని కొనసాగించడం’ అన్న అంశం నేపథ్యంగా ఈ సమావేశాన్ని నిర్వహించారు.

విలువైన అభిప్రాయాలను వెల్లడించిన వారికి ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలిపారు. 2047 నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే దిశగా మన ఆలోచనా విధానాన్ని మార్చుకోగలిగితే వికసిత భారత్ ను సాధించవచ్చని ఆయన స్పష్టం చేశారు.

అంతర్జాతీయ అనిశ్చితులు భౌగోళిక ఉద్రిక్తతల  కారణంగా ఉత్పన్నమవుతున్న సవాళ్లను ఎదుర్కోవడంముఖ్యంగా యువతను దృష్టిలో ఉంచుకుని ఉపాధిని మెరుగుపరిచే వ్యూహాలను రూపొందించడంఅన్ని రంగాల్లో స్థిరమైన ఉద్యోగ అవకాశాలను సృష్టించడంఉద్యోగ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విద్యశిక్షణ వ్యూహాలను రూపొందించడంవ్యవసాయ ఉత్పాదకతను పెంచడంసుస్థిరమైన గ్రామీణ ఉపాధి అవకాశాలను కల్పించడంమౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు ప్రభుత్వ నిధులను సమీకరించడం ద్వారా ఆర్థిక వృద్ధికి ఊతమివ్వడంఉద్యోగాల సృష్టిఆర్థిక సమ్మిళితత్వాన్ని ప్రోత్సహించడంఎగుమతులను పెంచడంవిదేశీ పెట్టుబడులను ఆకర్షించడం వంటి ముఖ్యమైన అంశాలపై నిపుణులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

ఈ సమావేశంలో డాక్టర్ సుర్జీత్ భళ్లాడాక్టర్ అశోక్ గులాటిడాక్టర్ సుదీప్తో ముండ్లేశ్రీ ధర్మకీర్తి జోషిశ్రీ జనమేజయ సిన్హాశ్రీ మదన్ సబ్నవీస్ప్రొఫెసర్ అమితా బాత్రాశ్రీ రిధమ్ దేశాయ్ప్రొఫెసర్ చేతన్ ఘాటేప్రొఫెసర్ భరత్ రామస్వామిడాక్టర్ సౌమ్య కాంతి ఘోష్శ్రీ సిద్ధార్థ సన్యాల్డాలవీశ్ భండారిశ్రీమతి రజనీ సిన్హాప్రొఫెసర్ కేశబ్ దాస్డాక్టర్ ప్రీతమ్ బెనర్జీశ్రీ రాహుల్ బజోరియాశ్రీ నిఖిల్ గుప్తప్రొఫెసర్ శాశ్వత్ అలోక్ సహా పలువురు ప్రముఖ ఆర్థికవేత్తలువిశ్లేషకులు పాల్గొన్నారు


(Release ID: 2087976) Visitor Counter : 16