ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

టెక్నాలజీ పరంగా ఆరోగ్య రంగంలో భారతదేశం చురుగ్గా పని చేస్తోంది: ప్రధానమంత్రి

Posted On: 20 NOV 2024 5:02AM by PIB Hyderabad

ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యాన్ని ఇచ్చినప్పుడే భూమి మేలైన ఆవాసంగా మారుతుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. టెక్నాలజీని సమన్వయ పరచడానికి ప్రథమ ప్రాధాన్యాన్ని ఇస్తూ, ఆరోగ్య సంరక్షణ రంగంలో భారతదేశం క్రియాశీలంగా ముందుకు సాగిపోతోందని ఆయన అన్నారు. ఈ విషయంలో ప్రపంచమంతటా జరుగుతున్న కృషిని భారత్ బలపరుస్తుందని ఆయన ప్రధానంగా చెప్పారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అదనోమ్ ఘెబ్రెయసస్ వ్యక్తం చేసిన అభిప్రాయానికి శ్రీ నరేంద్ర మోదీ ప్రతిస్పందిస్తూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ కింది విధంగా పేర్కొన్నారు.

‘‘ప్రియమైన సోదరుడు తులసికి,

ఆరోగ్యకరమైన ప్రజలతో కూడిన భూగోళం గొప్పది. ఆరోగ్య సంరక్షణ రంగంలో భారతదేశం చురుకుగా పని చేస్తోంది. మేం టెక్నాలజీని సమన్వయ పరచడానికి ప్రాధాన్యాన్ని ఇస్తున్నాం. అదే సమయంలో ప్రపంచ దేశాలు చేస్తున్న కృషికి మా వంతు తోడ్పాటును అందిస్తాం’’ @DrTedros”

 

 

***

MJPS/SR


(Release ID: 2074953) Visitor Counter : 6