ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్ షిప్ 2024 విజేతగా నిలిచిన పంకజ్ అద్వానీని అభినందించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 12 NOV 2024 4:03PM by PIB Hyderabad

ప్రపంచ స్నూకర్ చాంపియన్ షిప్స్ లో విజేతగా నిలిచిన పంకజ్ అద్వానీని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అభినందించారు. ఇది అసాధారణ విజయమని కొనియాడారు.

సామాజిక మాధ్యమం ఎక్స్ లో చేసిన పోస్టులో ఇలా పేర్కొన్నారు.

“ఇది మామూలు విజయం కాదు! మీకు శుభాకాంక్షలు. మీ అంకితభావం, తపన, నిబద్ధత అద్భుతం. మరోసారి యోగ్యతకు నిదర్శనంగా నిలిచారు. మీ విజయం భావి క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుంది @PankajAdvani247”.  

 

 

***

MJPS/SR


(రిలీజ్ ఐడి: 2072904) సందర్శకుల సూచీ సంఖ్య : : 67