ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ నారాయణ్ మృతికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం
प्रविष्टि तिथि:
01 NOV 2024 3:04PM by PIB Hyderabad
దేశ రాజకీయాల్లో, సామాజిక సేవా రంగంలో ప్రముఖుడు శ్రీ నారాయణ్ మృతికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.
సామాజిక ప్రసార మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో పొందుపరచిన ఒక భావోద్వేగభరిత సందేశంలో ప్రధాన మంత్రి ఈ కింది విధంగా పేర్కొన్నారు:
‘‘నారాయణ్ జీ మృతి తీరని లోటు; దేశ రాజకీయ రంగానికి, సామాజిక సేవా రంగానికి ఆయన చేసిన సేవలు వెలకట్ట లేనివి. బీజేపీలోని అత్యంత వయోవృద్ధ కార్యకర్తల్లో, పార్టీలో కష్టించి పనిచేసే కార్యకర్తల్లో ఆయన ఒకరు. భులయీ భాయీ గా ఆయనను మనకు సుపరిచితులే. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఈ దుఃఖ ఘడియలో ఆయన కుటుంబ సభ్యులకు, ఆయన అభిమానులకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఓమ్ శాంతి.’’
***
MJPS/SR/SKS
(रिलीज़ आईडी: 2070218)
आगंतुक पटल : 82
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam