ప్రధాన మంత్రి కార్యాలయం
జమ్మూకాశ్మీర్ శాసన సభ్యుడు శ్రీ దేవేందర్ సింగ్ రాణా మృతి పట్ల ప్రధానమంత్రి సంతాపం
प्रविष्टि तिथि:
01 NOV 2024 9:14AM by PIB Hyderabad
జమ్మూ కాశ్మీర్ శాసన సభ్యుడు శ్రీ దేవేందర్ సింగ్ రాణా మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.
“'దేవేందర్ సింగ్ రాణా అకాల మరణం దిగ్భ్రాంతి కలిగించింది. అనుభవం కలిగిన నాయకుడుగా రాణా జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పని చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి జమ్మూ కాశ్మీర్ లో బీజేపీని బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన కన్నుమూసిన ఈ విషాద సమయంలో నా ఆలోచనలు ఆయన కుటుంబం, మద్దతుదారులతోనే ఉన్నాయి. ఓం శాంతి" అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ వేదికగా చేసిన పోస్టులో పేర్కొన్నారు.
***
MJPS/TS
(रिलीज़ आईडी: 2069960)
आगंतुक पटल : 87
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam