ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రముఖ నృత్యకారుడు, సాంస్కృతిక మణిదీపం శ్రీ కనకరాజు మృతికి ప్రధానమంత్రి సంతాపం
Posted On:
26 OCT 2024 10:36AM by PIB Hyderabad
ప్రముఖ నృత్యకారుడు, సాంస్కృతిక మణిదీపం శ్రీ కనకరాజు మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం తెలియచేశారు. గుస్సాడీ నృత్యానికి ఆయన చేసిన సమున్నతమైన సేవలను, అంకిత భావాన్ని శ్రీ మోదీ కొనియాడారు. సాంస్కృతిక వారసత్వ చిహ్నలేవీ వాటి స్వాభావిక స్వరూపాన్ని కోల్పోకూడదన్న ఆయన తపనను ప్రశంసించారు.
ఎక్స్ వేదికగా శ్రీ మోదీ ఇలా రాశారు...
“ప్రముఖ నృత్యకారుడు, సాంస్కృతిక మణిదీపం శ్రీ కనకరాజు మరణం చాలా విచారం కలిగించింది. గుస్సాడీ నృత్యాన్ని పరిరక్షించేందుకు ఆయన చేసిన సేవలు ఎల్లప్పుడూ రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. కళా రంగం కోసం ఆయన పడే నిరంతర తపన, అంకిత భావం సాంస్కృతిక వారసత్వ చిహ్నలేవీ వాటి స్వాభావిక స్వరూపాన్ని కోల్పోకుండా వర్థిల్లేలా చేశాయి. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఓం శాంతి”.
***
MJPS/SR
(Release ID: 2068375)
Visitor Counter : 36
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam