ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉత్తరప్రదేశ్ వారణాసిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

Posted On: 20 OCT 2024 7:34PM by PIB Hyderabad

నమః పార్వతీ పతయేహర హర మహాదేవ!

వేదికపైన ఆశీనులైన ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీ బెన్ పటేల్ గారూరాష్ట ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ గారూసాంకేతికత మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమంతో అనుసంధానమైన ఇతర రాష్ట్రాల గవర్నర్లూముఖ్యమంత్రులూకేంద్ర మంత్రిమండలి సభ్యులూనా మంత్రివర్గ సహచరుడు శ్రీ నాయుడు గారూరాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్యబ్రజేష్ పాఠక్ గార్లూరాష్ర్ట మంత్రులూపార్లమెంటు సభ్యులూశాసన సభ్యులూఇంకా బెనారస్ వాసులైన నా ప్రియ సోదరీ సోదరులారా...

మరోమారు వారణాసిని సందర్శించే అవకాశం నాకు దక్కింది.. ఈ రోజు  చేత్ గంజ్ లో ‘నక్కటయ్యా’ జాతర జరుగుతోందిమరికొద్ది రోజుల్లో ధన్ తెరాస్దీపావళిఛాత్ పండుగలు రానున్నాయి. అయితే వాటి రాక కన్నా ముందుగానే ఇవ్వాళ ఇక్కడ ఒక అభివృద్ధి పండుగ జరుగుతోంది. ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు.

మిత్రులారానేడు బెనారస్ కి పర్వదినంఇప్పుడే ఒక పెద్ద కంటి ఆసుపత్రికి ప్రారంభోత్సవం చేసి ఇక్కడకు చేరుకోవడంలో కాస్త ఆలస్యం అయ్యిందిశంకర నేత్రాలయం వయసు పైబడిన వారికీపిల్లలకూ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందివిశ్వనాథుని కృప వల్ల అనేక కోట్ల రూపాయల విలువగల పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలూప్రారంభోత్సవాలూ జరిగాయిఈ ప్రాజెక్టుల వల్ల రాష్ట్రదేశ పురోభివృద్ధికి ఊతం లభిస్తుందిబాబత్ పూర్ఆగ్రాహ్రాన్ పూర్ లోని సర్సావా సహాఈరోజు ఉత్తరప్రదేశ్బీహార్పశ్చిమ బెంగాల్మధ్యప్రదేశ్ఛత్తీస్ గఢ్ లలో విమానాశ్రయాల ప్రారంభోత్సవాలు జరిగాయివిద్యనైపుణ్యాభివృద్ధిక్రీడలుఆరోగ్యంపర్యాటక రంగాలకు సంబంధించిబెనారస్ కు అనేక ప్రాజెక్టులు మంజూరయ్యాయిఈ ప్రాజెక్టులు మీకు సౌలభ్యాన్ని కల్పించేవి మాత్రమే కాకమన యువతకు పుష్కలంగా ఉపాధి అవకాశాలనూ కల్పిస్తాయిబుద్ధుడు బోధనలు అందించిన సారనాథ్ కు ఈ సీమ నెలవుఇటీవలే నేను ‘అభిధమ్మ’ మహోత్సవంలో పాలుపంచుకున్నానీఈరోజు సార్నాథ్ కు సంబంధించి  కోట్లాది రూపాయల విలువ చేసే అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు చేశాననీ మీకు తెలుసు.  కాశీ సారనాథ్ లతో ప్రత్యేక అనుబంధంగల పాళీప్రాకృత భాషలకు ప్రాచీన భాషల హోదా కల్పించామనీ మీకు తెలుసుఆ భాషలకు ఇటువంటి గౌరవం లభించడం మనందరకూ గర్వకారణంఅభినందనలువివిధ అభివృద్ధి ప్రాజెక్టుల దృష్ట్యా కూడా దేశవాసులకు అభినందనలు తెలియజేస్తున్నాను.   

మిత్రులారావరసగా మూడోసారి మీకు సేవచేసే బాధ్యతను అప్పగించినప్పుడుఇకపై మూడింతల వేగంతో పనిచేస్తానని మీకు మాటిచ్చానుకొత్త ప్రభత్వం ఏర్పడి 125 రోజులు పూర్తవకముందేఅతి స్వల్ప కాలంలో  దేశవ్యాప్తంగా 15 లక్షల కోట్ల రూపాయల ఖర్చుతో అనేకానేక ప్రాజెక్టులు చేపట్టాంనిరుపేదలు రైతాంగంయువత కోసమే అత్యధికంగా ఈ ఖర్చు చేశాంఇందుకు భిన్నంగా పదేళ్ళ కిందట వార్తాపత్రికల శీర్షికలు ఎలాగుండేవో గుర్తు చేసుకుంటేలక్షల కోట్ల రూపాయల అవినీతి గురించిన వార్తలే ప్రముఖంగా కనబడేవినేడు ఇంటింటా 125 రోజుల్లో 15 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి పనుల ఖర్చు గురించే చర్చలు జరుగుతున్నాయిఇలాంటి మార్పునే దేశం కోరుకుంటోందిప్రజాధనం ప్రజల కోసందేశాభివృద్ధి కోసంనిజాయితీగా ఖర్చుచేయాలన్నదే మా ఆశయం.

మిత్రులారాగత పదేళ్ళలో పెద్దఎత్తున దేశ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాంఈ మౌలిక రంగ అభివృద్ధి లక్ష్యాలు ముఖ్యంగా రెండు రకాలు – ఒకటిపెట్టుబడుల ద్వారా పౌరులకు మెరుగైన సౌకర్యాలను కల్పించడంరెండుఇవే పెట్టుబడుల ద్వారా యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలను అందించడంనేడు దేశంలో అత్యాధునిక రహదారులూకొత్త మార్గాల్లో కొత్త రైల్వే లైన్లూకొత్త విమానాశ్రయాల నిర్మాణాలు జరుగుతున్నాయి.  వీటిని కేవలం ఇటుకలూరాళ్ళూలోహంఇనుప కడ్డీల నిర్మాణాలుగా చూడలేం. ప్రజలకు సౌకర్యం అందించేదేశ యువతకు ఉపాధిని అందించే సాధనాలివి.

ఆధునిక హంగులతో మేం నిర్మించిన బాబత్ పూర్ విమానాశ్రయాన్నే తీసుకోండి. కేవలం విమానాశ్రయాన్ని వినియోగించుకుని రాకపోకలు సాగించేవారికి మాత్రమే లబ్ధి కలిగిందాలేదేబెనారస్ వాసులకు అనేక ఉపాధి అవకాశాలను కల్పించడమే కాకవ్యవసాయంపరిశ్రమలుపర్యాటకానికి కూడా దన్నుగా నిలుస్తోంది కదాఈరోజున బెనారస్ ను సందర్శించేవారి సంఖ్య అనేక రేట్లు పెరిగిందికొందరు చూడటానికిమరికొందరు వ్యాపార నిమిత్తంఈ నగరాన్ని సందర్శిస్తూ ఉంటారుదీనివల్ల మీరంతా లాభపడుతున్నారు కదాఈ రోజు బాబత్ పూర్ విమానాశ్రయ విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. దీని వల్ల మీరంతా మరింత లాభపడతారుప్రాజెక్టు పూర్తవడంతోటే మరిన్ని విమానాలు స్థానిక విమానాశ్రయాన్ని వినియోగించుకుంటాయి.

మిత్రులారాఈ కొత్త మౌలిక సదుపాయాల మహాయజ్ఞం వల్లమనం నిర్మించిన అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన విమానాశ్రయాలుభవంతుల గురించి ప్రపంచం ముచ్చటిస్తోంది. 2014 లో మన దేశంలో కేవలం 70 విమానాశ్రయాలే ఉండేవిఇప్పుడే నాయుడు గారు వివరణ వల్ల ఈ సంఖ్య 150 కి చేరుకున్నట్లు తెలుసుకున్నాంకేవలం కొత్త విమానాశ్రయాల నిర్మాణానికే మనం పరిమితమవలేదుసగటున నెలకి ఒకటి చొప్పునదేశంలోని డజను విమానాశ్రయాల్లో కొత్త సదుపాయాలు కల్పించి నవీకరించాంపునరుద్ధరణ పనులు జరిగిన విమానాశ్రయాల్లో అలీగఢ్మొరాదాబాద్శ్రావస్తిచిత్రకూట్ ఉన్నాయిఅద్భుతమైన సౌకర్యాలు గల అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు ప్రతిరోజూ రామభక్తులకు స్వాగతం పలుకుతోందిఉత్తరప్రదేశ్ లో రహదారుల పరిస్థితి అధ్వాన్నంగా ఉంటుందని ఒకప్పుడు అనుకునేవారు. నేడు ఈ రాష్ట్రం జాతీయస్థాయి ఎక్స్ప్రెస్ వే లకు నిలయంగా ఉన్నదిఅదేవిధంగా అత్యధిక విమానాశ్రయాలు గల రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ గుర్తింపు తెచ్చుకుందినోయిడా జెవార్ వద్ద మరో అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి కావస్తోందిరాష్ట్రంలో ఇంతటి అభివృద్ధి సాధించినందుకు,  యోగీ గారికీకేశవ్ ప్రసాద్ మౌర్య గారికీబ్రజేష్ పాఠక్ గారికీవారి బృందం మొత్తానికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను.  

మిత్రులారా,

బెనారస్ పార్లమెంటు సభ్యుడుగా ఇక్కడ జరిగిన అభివృద్ధిని చూసి నేను గర్విస్తున్నానుప్రాచీన వారసత్వ పరిరక్షణతో కూడిన అభివృద్ధిని సాధించిపట్టణాభివృద్ధికి నమూనాగా నిలిచే  ఆధునిక నగరంగా కాశీని తీర్చిదిద్దాలన్నది మనందరి స్వప్నంకాశీ విశ్వనాథుని భవ్య ఆలయంరుద్రాక్ష సమావేశ మందిరంవలయ రహదారిగంజారీ స్టేడియం వంటి కొత్తరకం మౌలిక సదుపాయాల గురించి నేడు అందరూ మాట్లాడుకుంటున్నారుకాశీలో కొత్త రోప్ వే నిర్మాణం కూడా జరగబోతోందివిశాలమైన రహదార్లూగంగానది సుందర తీరాలూ ఇవన్నీ మనసుని ఆహ్లాదపరిచేవే.

మిత్రులారాకాశీ సహా మొత్తం పూర్వాంచల్ (ఉత్తరప్రదేశ్ లోని  తూర్పు ప్రాంతాలూబీహార్ లోని పశ్చిమ ప్రాంతాలుప్రాంతాన్ని వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి కొనసాగిస్తున్నాంగంగానదిపై కొత్త రైలు-రోడ్డు బ్రిడ్జి నిర్మాణానికి కొద్దిరోజుల కిందటే ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందిరాజ్ ఘాట్ బ్రిడ్జి వద్ద  మరో పెద్ద బ్రిడ్జి నిర్మాణం జరగబోతోందికింద రైళ్ళువంతెన పైన ఆరు లైన్ల రహదారి నిర్మాణం జరుగుతుందిదీనివల్ల బెనారస్చందౌలికి చెందిన లక్షలాది ప్రజలు ప్రయోజనం పొందుతారు.

మిత్రులారాక్రీడల కేంద్రంగా కూడా కాశీ గుర్తింపు పొందుతోందిపునరుద్ధరణ పనులు జరిగిన సిగ్రా క్రీడాంగణం ఈనాడు కొత్తగా మీముందు నిలుస్తోందిజాతీయ క్రీడలకే గాక ఒలింపిక్స్ కు కూడా ఆతిథ్యం ఇవ్వగల సదుపాయాలను ఈ స్టేడియం కలిగి ఉందిక్రీడా సదుపాయాలను ఇక్కడ ఏర్పరచారుఇటీవల ముగిసిన ‘సంసద్ ఖేల్ ప్రతియోగితా’ వల్ల కాశీ యువత సామర్ధ్యం ఎంతటిదో మనకి అవగతమైందిఇక పెద్దపెద్ద ఆటలపోటీల్లో పాల్గొనేందుకు అవసరమైన సదుపాయాలన్నీ మన పూర్వాంచల్ బిడ్డలకు  ఇక్కడే లభిస్తాయి.  

మిత్రులారామహిళలకూయువతకూ సాధికారత అందించిన  సమాజం తప్పక అభివృద్ది సాధిస్తుందిదీన్ని దృష్టిలో ఉంచుకునే మేం నారీశక్తికి సహకారం అందిస్తున్నాం. స్త్రీలు సొంత వ్యాపారాలు మొదలుపెట్టేందుకు అనువుగా లక్షలాది మహిళలకు ‘ముద్ర’ రుణాలను అందించాంగ్రామాల్లో ‘లఖ్ పతి దీదీ’ లను తయారుచేయడం మా తదుపరి లక్ష్యంఈరోజున మన గ్రామీణ సోదరీమణులు డ్రోన్ పైలెట్లుగా కూడా పనిచేస్తున్నారుస్వయంగా మహాశివుడుఅన్నపూర్ణేశ్వరి నుంచీ భిక్షను అర్ధించే కాశీ క్షేత్రమిదిసాధికార మహిళలను కలిగిన సమాజం అభివృద్ధి సాధిస్తుందని కాశీ నగరం మనకు నేర్పుతోందిఈ నమ్మకంతోనే ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనలోని ప్రతి అంశంలోనూ ‘నారీశక్తి’ని కేంద్రంగా చేశాం. ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన’ పథకందేశంలోని లక్షలాది మహిళలకు సొంత ఇళ్ళను  బహుమతిగా అందించిందిబెనారస్ కు చెందిన అనేకులు కూడా పథకం వల్ల లబ్ధి పొందారుఇక మరో కోట్ల నూతన గృహాలు నిర్మించాలని ప్రభుత్వం తలపెడుతోందిఇంతవరకూ ‘పీఎం ఆవాస్ యోజన’ కింద ఇళ్ళు లభించని వారణాసి మహిళలకు ఇక మీదట లభిస్తాయిఇప్పటికే మేం నల్లాల ద్వారా తాగునీరుగృహ అవసరాలకు నీరు సహా ఉజ్జ్వల గ్యాస్ ను అందించాంఇప్పుడు ఉచిత విద్యుత్తువిద్యుత్ ద్వారా ఆదాయం సమకూర్చే  పథకాలను ప్రారంభించబోతున్నాం. ‘పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన’మన సోదరీమణుల జీవితాలను మెరుగుపరుస్తుంది.   

మిత్రులారామహాశివుడి పవిత్ర జ్యోతిర్లింగానికీమోక్షస్థానమైన మణికర్ణికకూజ్ఞానాన్ని అందించే సారనాథ్ కూ ఆలవాలమైన మన కాశీ నగరం సాంస్కృతిక వైభవానికి చిహ్నంఎన్నో దశాబ్దాల పాటు పట్టించుకోకుండా వదిలేసిన కాశీ నగరంలోఇప్పుడు ఏకకాలంలోఅనేక రంగాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయిఅందుకే ఇప్పుడు మీకో ప్రశ్న – కాశీ అభివృద్ధికి నోచుకోకుండా నిరోధించిన దృక్పథాలు ఏవిఅభివృద్ధి పనుల కోసం అలమటించిన 10 ఏళ్ళ నాటి కాశీని గుర్తు చేసుకోండి.. ఉత్తరప్రదేశ్ ను దశాబ్దాలపాటు పాలించిఢిల్లీలో అధికారాన్ని అనుభవించిన ఆ పార్టీలు ఏనాడూ బెనారస్ అభివృద్ధికి ప్రాముఖ్యం ఇవ్వలేదుతరచి చూస్తేకుటుంబ పాలనబుజ్జగింపు రాజకీయాలు అందుకు కారణాలుగా మనకి కనిపిస్తాయికాంగ్రెస్ కానీయండిసమాజవాదీ పార్టీ కానివ్వండిబెనారస్ అభివృద్ధిని ఈ పార్టీలు ఏనాడూ పట్టించుకోలేదు. భవిష్యత్తులో పట్టించుకుంటాయన్న ఆశ లేదు.  చివరికి అభివృద్ధి పనుల్లో కూడా వివక్ష చూపిన పార్టీలవి 

ఇందుకు భిన్నంగాఏ పథకంలోనూ వివక్షకు తావివ్వని మా ప్రభుత్వం,  ‘సబ్కా సాథ్సబ్కా వికాస్’ అన్న సూత్రమే మంత్రంగా ముందుకు సాగుతోందిమేం చెప్పినదాన్నేవిస్పష్టంగా ప్రకటించి ఆచరణలో పెడతాంఅయోధ్యలో బ్రహ్మాండమైన రామమందిర నిర్మాణం జరుగుతోందిరామ్ లల్లాను ప్రతిరోజూ లక్షలాది భక్తులు సందర్శించుకుంటున్నారుపార్లమెంటుశాసనసభల్లో  మహిళలకు రిజర్వేషన్ అంశం అనేక సంవత్సరాల పాటు మూలన పడిందిఈ అంశంలో కదలిక తెచ్చిచారిత్రిక నిర్ణయం తీసుకోవడం కూడా మా హయాంలోనే జరిగింది. ‘ముమ్మారు తలాక్’ క్రూర సంప్రదాయం వల్ల అనేక కుటుంబాలు ఇబ్బందుల పాలయ్యేవి. అటువంటి ఇబ్బంది నుంచి ముస్లిం మహిళలకు మా ప్రభుత్వమే విముక్తి కల్పించింది. ‘ఇతర వెనుకబడిన కులాల (ఓబీసీకమిషన్’ కు రాజ్యాంగ హోదా కల్పించింది కూడా బీజేపీ ప్రభుత్వమేఅంతే కాదుఎవరి హక్కులకూ భంగం వాటిల్లకుండాఆర్ధికంగా వెనుకబడిన కులాలకు 10% అదనపు రిజర్వేషన్ లను కల్పించినదీ మేమే!

మిత్రులారామా పనిని మేం నెరవేర్చాందేశంలోని ప్రతి కుటుంబ జీవన చిత్రాన్నీ మార్చేందుకు మేం సదుద్దేశంతోనిజాయితీగా పనిచేశాంఅందుకే దేశం మాకు దీవెనలను అందించడం కొనసాగిస్తోందిహర్యానాలో వరసగా మూడోసారి బీజేపీ ప్రభుత్వం ఎంపికయ్యిందిజమ్మూ కాశ్మీర్ లో కూడా రికార్డ్ సంఖ్యలో మాకు ఓట్లు లభించాయి.

మిత్రులారాకుటుంబ రాజకీయాల బెడదను దేశం నేడు ఎదుర్కొంటోందివారసత్వ రాజకీయాల వల్ల యువత తీవ్రంగా నష్టపోతోందిఈ పార్టీలు యువతకు ఏనాడూ అవకాశాలనివ్వవుఅందుకనేరాజకీయాలతో సంబంధంలేని కుటుంబాలకు చెందిన 100,000 యువతను రాజకీయాల్లోకి ఆహ్వానిస్తానని ఎర్రకోట బురుజు నుంచి చేసిన ప్రసంగంలో నేను తెలియచేశానుఇది భారతీయ రాజకీయాల రూపురేఖలని మార్చి వేసే  ప్రచారోద్యమంఅవినీతివారసత్వ పోకలకు చరమగీతం పాడే ఉద్యమంఈ సరికొత్త రాజకీయ ఉద్యమ మూలస్థంభాలుగా నిలవాలని కాశీఉత్తరప్రదేశ్ యువతకు ఇదే నా పిలుపుకాశీ పార్లమెంటు సభ్యుడిగాస్థానిక యువత అభివృద్ధికి నేను కట్టుబడి ఉన్నాను.  

మిత్రులారాదేశం అభివృద్ధిలో నూతన ప్రమాణాల విషయంలో కాశీ మరోమారు స్ఫూర్తిగా నిలుస్తూ,  దేశానికి చైతన్యాన్ని అందించడంలో తన ఉనికిని చాటుతోందిఅన్ని రాష్ట్రాలూగవర్నర్లూముఖ్యమంత్రులూకాశీ పౌరులు సహా,  నేటి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి దేశ పౌరునికీ  నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

నాతో కలిసి అనండినమః పార్వతీ పతయేహర హర మహాదేవ!

 

***


(Release ID: 2066755) Visitor Counter : 40