ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారత్ యాక్ట్ ఈస్ట్ పాలసీ (ఎఇపి) మద్దతుతో ఇండో-పసిఫిక్ పై ఆసియన్ దేశాల దృక్కోణం (ఆసియాన్ అవుట్ లుక్ -ఎఒఐపి) నేపథ్యంలో ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరత, ప్రగతి కోసం ఆసియాన్-భారత్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై సంయుక్త ప్రకటన

Posted On: 10 OCT 2024 5:41PM by PIB Hyderabad

అసోసియేషన్ ఆఫ్ ఆగ్నేయాసియా నేషన్స్ (ఆసియాన్), రిపబ్లిక్ ఆఫ్ ఇండియా సభ్యదేశాలైన మేము 2024 అక్టోబర్ 10 న లావో పిడిఆర్ లోని వియాంటియాన్ లో 21 వ ఆసియాన్-ఇండియా శిఖరాగ్ర సదస్సు సందర్భంగా సమావేశమయ్యాం


మనం 1992లో ఆసియాన్-ఇండియా సంభాషణ ప్రక్రియను ప్రారంభించినప్పటి నుంచి దానిని ముందుకు నడిపిస్తున్న ప్రాథమిక సూత్రాలుపంచుకున్న విలువలునియమాలతో మార్గనిర్దేశం చేసిన ఆసియాన్-ఇండియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి పునరంకితమవుతున్నాంఆసియాన్-ఇండియా స్మారక సదస్సు (2012) దార్శనిక ప్రకటనఆసియాన్-ఇండియా డైలాగ్ రిలేషన్స్ (2018) 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆసియాన్-ఇండియా స్మారక శిఖరాగ్ర సమావేశం ఢిల్లీ డిక్లరేషన్ఈ ప్రాంతంలో శాంతిసుస్థిరతసౌభాగ్యం కోసం ఇండో-పసిఫిక్ పై ఆసియాన్ వైఖరికి సహకారంపై ఆసియాన్-ఇండియా సంయుక్త ప్రకటన (2021), ఆసియాన్-భారత్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై సంయుక్త ప్రకటన (2022), సముద్ర అంశాలలో సహకారంపై ఆసియాన్-భారత్ సంయుక్త ప్రకటన (2023), సంక్షోభాలకు ప్రతిస్పందనగా ఆహార భద్రతపోషకాహారాన్ని బలోపేతం చేయడంపై ఆసియాన్-ఇండియా సంయుక్త నాయకుల ప్రకటన (2023) మొదలయిన వాటిలో పేర్కొన్న అంశాలతో సహా ఆసియాన్-ఇండియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నాం

ఆసియాన్ ప్రాధాన్యత కేంద్ర బిందువుగా ఉన్న భారతదేశ ఈస్ట్ యాక్ట్ పాలసీ దశాబ్దాన్ని స్వాగతిస్తున్నాంఇది రాజకీయ-భద్రతఆర్థికసాంస్కృతికప్రజల పరస్పర సంబంధాల రంగాలలో సహకారం ద్వారా ఆసియాన్-ఇండియా సంబంధాలను ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడింది.

ఆసియాన్-భారత సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి బలమైన పునాదిని అందిస్తూఇండో-పసిఫిక్‌లోని వివిధ సముద్రాలు మహాసముద్రాలను కలుపుకుని ఆగ్నేయాసియా,  భారతదేశం మధ్య భూమి సముద్ర మార్గాల ద్వారా సులభతరం చేసిన లోతైన నాగరికత అనుసంధానాలనుఅంతర్-సాంస్కృతిక మార్పిడులను మేము గుర్తిస్తున్నాం.  

ఆసియాన్-ఇండియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి యాక్ట్ ఈస్ట్ పాలసీ దశాబ్ది సందర్భంగా 2024 సంవత్సరంలో నిర్వహించిన కార్యకలాపాలుచొరవలను స్వాగతిస్తున్నాం


అభివృద్ధి చెందుతున్న ప్రాంతీయ నిర్మాణంలో ఆసియాన్ ప్రాధాన్యతకుఐక్యతకు భారతదేశం ఇస్తున్న మద్దతును గుర్తిస్తున్నాంఅలాగేఆసియాన్-ఇండియా సమ్మిట్ఈస్ట్ ఆసియా సమ్మిట్ (ఇఎఎస్), పోస్ట్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ విత్ ఇండియా (పీఎంసీ+1), ఆసియాన్ రీజనల్ ఫోరం (ఎఆర్ఎఫ్), ఆసియాన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ప్లస్ (ఏడీఎంఎం-ప్లస్), విస్తరించిన ఆసియాన్ మారిటైమ్ ఫోరం (ఈఏఎంఎఫ్)లతో పాటు మాస్టర్ ప్లాన్ ఫర్ ఆసియాన్ కనెక్టివిటీ (ఎంపీఏసీ) 2025, ఇనిషియేటివ్ ఫర్ ఆసియాన్ ఇంటిగ్రేషన్ (ఐఏఐ), ఆసియాన్ ఔట్ లుక్ ఆన్ ఇండో-పసిఫిక్ (ఏవోఐపీ)లతో సహా ఆసియాన్ నేతృత్వంలోని యంత్రాంగాల ద్వారావేదికల ద్వారా సన్నిహితంగా పనిచేయడానికి భారత్ ప్రదర్శిస్తున్న నిబద్ధతను కూడా గుర్తిస్తున్నాం

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (యు ఎస్ఎన్ జిఎతీర్మానం (A/RES/78/69) ను పరిగణనలోకి తీసుకుంటూ,  మహాసముద్రాలుసముద్రాలలో అన్ని కార్యకలాపాలు నిర్వహించాల్సిన చట్టపరమైన పరిధిని ఈ ఒప్పందం నిర్దేశిస్తుందనిసముద్ర రంగంలో జాతీయప్రాంతీయ అంతర్జాతీయ కార్యాచరణకుసహకారానికి ప్రాతిపదికగా ఇది వ్యూహాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉందనిదాని సమగ్రతను కాపాడాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటిస్తున్నాం


భాగస్వామ్య ప్రజాస్వామ్య విలువలుసార్వభౌమత్వంప్రాదేశిక సమగ్రతపై బలమైన విశ్వాసంచట్టపాలనఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై భాగస్వామ్య నిబద్ధత ఆధారంగా ఈ ప్రాంతంలో శాంతిసుస్థిరత్వం శ్రేయస్సు కోసం ఇండో-పసిఫిక్ పట్ల ఆసియాన్ దృక్పథంపై సహకారానికి సంబంధించి ఆసియాన్-ఇండియా సంయుక్త ప్రకటనను అమలు చేయడానికి చేసిన ప్రయత్నాలను అభినందిస్తున్నాం

బహుపాక్షికతనుఐక్యరాజ్యసమితి చార్టర్‌లో పొందుపరచిన ఉద్దేశాలు ,సూత్రాలనుఅలాగే అంతర్జాతీయ చట్టాన్ని గౌరవించడంలో మా అంకితభావాన్ని పునరుద్ఘాటిస్తూఅభివృద్ధి చెందుతున్న బహుళ ధ్రువ ప్రపంచ వ్యవస్థలో ఆసియాన్ కు పెరుగుతున్న ప్రపంచ ప్రాధాన్యతనుప్రత్యేకమైన సమన్వయ శక్తిని గుర్తిస్తున్నాంప్రధాన అంతర్జాతీయ ఆర్థిక రాజకీయ వ్యవహారాలలో  పెరుగుతున్న భారత్ క్రియాశీలక పాత్రను కూడా గమనిస్తున్నాం.

మేము ప్రకటిస్తున్నాం…

1. ప్రాంతంలో శాంతిస్థిరత్వంసముద్ర భద్రతరక్షణనౌకాయాన విమానాల స్వేచ్ఛను కొనసాగించాలిఅలాగే సముద్ర వాణిజ్యాన్ని నిర్బంధాలు లేకుండా కొనసాగించడాన్ని , 1982 యు ఎన్ సి ఎల్ ఒ ఎస్ సహా అంతర్జాతీయ చట్టంలోని విశ్వవ్యాప్తంగా గుర్తించిన సూత్రాల ప్రకారంఅంతర్జాతీయ పౌర విమాన సంస్థ (ఐ సి ఎ ఒ), అంతర్జాతీయ సముద్ర సంస్థ (ఐ ఎం ఒ)ఆధారిత ప్రమాణాలు సిఫారసు చేసిన పద్ధతులకు అనుగుణంగా వివాదాలకు శాంతియుత పరిష్కారాలను కనుగొనడంతో సహా సముద్రాల ఇతర చట్టబద్ధమైన వినియోగాల ప్రాధాన్యతను పునరుద్ఘాటించాలి

2. 2023లో మొదటి ఆసియన్ ఇండియా మారిటైమ్ ఎక్సర్ సైజ్ (ఎఐఎంఇ ) , ఉగ్రవాద నిరోధం పై ఎడిఎంఎం -ప్లస్ సహాధ్యక్షతన నిపుణుల అధ్యయన బృందం సమావేశం(2024-2027), అలాగే ఆసియన్ -ఇండియా రక్షణ మంత్రుల ఇష్టాగోష్టి సమావేశం (2022) లో ప్రకటించిన రెండు కార్యక్రమాలతో సహా అసియన్ రక్షణ మంత్రుల సమావేశం (ఎడిడిఎంపరిధిలో రక్షణ భద్రతా పై కొనసాగుతున్న సహకారాన్ని మెరుగుపరచాలి

3. సముద్ర భద్రతఉగ్రవాద నిరోధంసైబర్ సెక్యూరిటీమిలిటరీ మెడిసిన్అంతర్జాతీయ నేరాలురక్షణ పరిశ్రమమానవతా సహాయంవిపత్తు ఉపశమనంశాంతిస్థాపనఅవాంఛనీయ కార్యకలాపాలు ఆత్మవిశ్వాసం పెంపొందించే చర్యల్లో సహకారాన్ని బలోపేతం చేయాలిపరస్పర సందర్శనలుసంయుక్త సైనిక విన్యాసాలుసముద్ర విన్యాసాలునావికాదళం నౌకలను పోర్టులకు ఆహ్వానించడంరక్షణ స్కాలర్ షిప్ ల ద్వారా ఇది సాధ్యమవుతుంది

4. ఆసియాన్-ఇండియా సముద్ర సహకారంపై సంయుక్త ప్రకటన అమలులో పురోగతి సాధించాలిసముద్ర భద్రతనీలి ఆర్థిక వ్యవస్థస్థిరమైన మత్స్య సంపదసముద్ర పర్యావరణ పరిరక్షణసముద్ర జీవ వైవిధ్యంవాతావరణ మార్పుల సమస్యలు వంటి అంశాలలో సహకారం కొనసాగించాలి


5. ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికిపంచుకున్న లక్ష్యాలను సాధించడానికి అనుసంధానమైన కార్యక్రమాలను కొనసాగించడానికిఅలాగే మన ప్రజల ప్రయోజనాల కోసం స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఐక్యరాజ్యసమితి ద్వారావివిధ ప్రక్రియల ద్వారా బహుళ పాక్షికతను బలోపేతం చేయాలి

6. ప్రాంతంలో శాంతిస్థిరత్వం అభివృద్ధి కోసం ఎఒఐపి  పై ఆసియాన్-ఇండియా సహకారానికి సంబంధించిన సంయుక్త ప్రకటనను ఆధారంగా చేసుకునిఎఒఐపి,  ఇండో-పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్ (ఐ పి ఒ ఐమధ్య సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లాలి.

7. ఆసియాన్-ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ (ఎఐటిజిఎసమీక్షను వేగవంతం చేసిదానిని మరింత ప్రభావవంతంగావినియోగదారులకు అనుకూలంగాసులభంగావ్యాపారాలకు సౌకర్యవంతంగా చేయాలిప్రస్తుత అంతర్జాతీయ గ్లోబల్ వాణిజ్య పద్ధతులకు అనుగుణంగా మార్చాలిపరస్పర ప్రయోజనకరమైన ఏర్పాట్లను ప్రోత్సహించడం తో పాటు ఆసియాన్భారతదేశం మధ్య ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేయాలి.

8. 
సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించడానికి పరస్పర ఆసక్తి ఉన్న రంగాలలో సరఫరా వ్యవస్థలలో అవకాశం ఉన్న ప్రమాదాలను గుర్తించి వాటిని సమర్థంగా పరిష్కరించడంపై సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటూ వైవిధ్యమైనసురక్షితమైనపారదర్శక సుస్థిర వ్యవస్థలుగా మార్చాలి.

9. కృత్రిమ మేధస్సు (ఏఐ), బ్లాక్‌ చెయిన్ సాంకేతికతఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), రోబోటిక్స్క్వాంటం కంప్యూటింగ్, 6- జి సాంకేతికతతో సహా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై సహకరించుకోవాలిడిజిటల్ అనుసంధానంఆర్థిక సాంకేతికతపై ప్రత్యేక దృష్టి పెట్టి అంకుర సంస్థల ఆవిర్భావానికి దోహదపడే పరిస్థితులను సృష్టించిబలోపేతం చేయాలి

10. సంయుక్త కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడానికి డిజిటల్ భవిష్యత్ కోసం  ఆసియాన్-ఇండియా నిధిని ప్రారంభించడాన్ని స్వాగతించాలి.

11. కృత్రిమ మేధస్సు వేగవంతమైన పురోగతి ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు విస్తరణకు సామర్ధ్యం కలిగి ఉందని గుర్తించాంకృత్రిమ మేధస్సు పై అంతర్జాతీయ స్థాయిలో సహకారంనిర్వహణ కోసం తదుపరి చర్చలను ప్రోత్సహించడం ద్వారా దాని సురక్షితమైనభరోసా కలిగిన బాధ్యతాయుతమైనవిశ్వసనీయ పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించడానికి సహకరిస్తాం.  మనకు ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడానికి కృత్రిమ మేధస్సును  బాధ్యతాయుతమైనసమన్వయపూర్వకమైన ప్రజా దృష్టితో ఉపయోగించడానికి ప్రయత్నించాలిఇందులో ప్రజల హక్కులు భద్రతను పరిరక్షించడం పరమార్థంగా ఉండాలి.

12. సుస్థిర సామాజిక ఆర్థిక అభివృద్ధి ఆర్థిక ప్రగతిని ప్రోత్సహించడంలో పర్యాటక రంగం కీలక పాత్రను గుర్తిస్తూసుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి ఒక వాహకంగా ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి 2025 సంవత్సరాన్ని ఆసియాన్-ఇండియా ఇయర్ ఆఫ్ టూరిజంగా జరుపుకోవాలనే ప్రతిపాదనను స్వాగతిస్తున్నాంఈ ప్రయత్నంలో, 2023-2027 కోసం ఆసియాన్-ఇండియా పర్యాటక సహకార కార్యాచరణ ప్రణాళికను అమలు చేయడానికి మేము మద్దతు ఇస్తున్నాంఅలాగే సామర్థ్యాన్ని పెంచడానికి ఉన్నతమైన నాణ్యత ప్రమాణాలతో పర్యాటక పరిశ్రమను తీర్చిదిద్దడానికి పర్యాటక విద్యశిక్షణపరిశోధన కోసం సంయుక్త కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడానికి మరింత సహకారంపై దృష్టి పెట్టాలిప్రయాణ సౌకర్యాలు అందించే వాటాదారుల మధ్య వ్యాపార వ్యవస్థల  విస్తరణసుస్థిర బాధ్యతాయుతమైన టూరిజం ప్రణాళికల అమలుఅలాగే పర్యాటక ధోరణులు సమాచార మార్పిడిని కూడా మేము ప్రోత్సహిస్తాముసంక్షోభ సమయాలలో కమ్యూనికేషన్ల మెరుగుదలపర్యాటక రంగంలో పెట్టుబడి అవకాశాలను ప్రోత్సహించడంఅలాగే సముచిత మార్కెట్లుక్రూయిజ్ టూరిజం పర్యాటక ప్రమాణాల అభివృద్ధికి మేము మద్దతు ఇస్తాము.

13. పరిశోధనఅభివృద్ధి (ఆర్ అండ్ డి ), అత్యవసర పరిస్థితిలో ప్రజారోగ్య సన్నద్ధతఆరోగ్య నిపుణులకు శిక్షణవైద్య సాంకేతికతఫార్మాస్యూటికల్స్వ్యాక్సిన్ భద్రతస్వావలంబనవ్యాక్సిన్ అభివృద్ధిఉత్పత్తిఅలాగే సాధారణసంప్రదాయ వైద్యం వంటి రంగాల్లో ప్రజారోగ్యంపై సహకారాన్ని పెంపొందించడం ద్వారా ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయాలి

14. పర్యావరణ రంగంలోముఖ్యంగా జీవ వైవిధ్యం,  వాతావరణ మార్పుల విషయంలో సహకారాన్ని బలోపేతం చేయాలిఅలాగే 2021-2025 కోసం ఆసియాన్ ఇంధన సహకార కార్యాచరణ ప్రణాళికకు అనుగుణంగాశుభ్రమైనపునరుత్పాదక తక్కువ కార్బన్ ఇంధనం కోసం సహకారాన్ని అన్వేషించాలి.  భారత పునరుత్పాదక ఇంధన ప్రాధాన్యతలు,  బయో-సర్క్యులర్-గ్రీన్ అభివృద్ధి వంటి జాతీయ నమూనాలుప్రాధాన్యతలతో సహా ఇతర ఇంధన భద్రత రంగాల్లో కూడా సహకరించుకోవాలి

15. విజ్ఞాన మార్పిడి ఉత్తమ పద్ధతుల ద్వారాసామర్థ్య పెంపుసాంకేతిక సహాయంతో మౌలిక వసతుల వ్యవస్థల ద్వారా విపత్తు వాతావరణ ప్రతికూలతల నిరోధకతను ప్రోత్సహించాలిఈ లక్ష్యాన్ని విపత్తుల నిరోధక మౌలిక వసతుల (సి డి ఆర్ ఐ వ్యవస్థ,  విపత్తు నిర్వహణ సంబంధిత ఆసియాన్ సమన్వయ కేంద్రం (ఎ హెచ్ ఎ సెంటర్) , భారత జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్ ఎం డి ఎ మధ్య  ప్రతిపాదిత ఆమోద  పత్రం (ఎం ఒ ఐ ద్వారా సాధించవచ్చు.

16. “కనెక్టింగ్ ద కనెక్టివిటీస్” విధానానికి అనుగుణంగాఆసియాన్ కనెక్టివిటీ మాస్టర్ ప్లాన్ (ఎం పి ఎ సి ) 2025 , దాని తరువాతి పత్రం అయిన ఆసియాన్ కనెక్టివిటీ స్ట్రాటజిక్ ప్లాన్ (ఎ సి ఎస్ పి ) , భారత్ యాక్ట్ ఈస్ట్ పాలసీసెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ది రీజియన్ (సాగర్విజన్  క్రింద భారతదేశ అనుసంధాన (కనెక్టివిటీకార్యక్రమాల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం ద్వారా ఆసియాన్-ఇండియా మధ్య కనెక్టివిటీని బలోపేతం చేయాలిఇందుకుమెరుగైన, , స్థిరమైన నిరోధక మౌలిక వసతుల కోసం సహకరించుకోవాలిభూమి వాయుసముద్ర రవాణా రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవాలి.  భారత్మయన్మార్-థాయిలాండ్ (ఐ ఎం టి త్రైపాక్షిక రహదారిని త్వరగా పూర్తి చేసి ప్రారంభించాలిలావో పిడిఆర్ కంబోడియా వియత్నాం వరకు తూర్పు వైపుగా విస్తరించడం వంటి లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లాలి

17. ఐక్యరాజ్యసమితిఅంతర్జాతీయ ఆర్థిక అల్లికఅంతర్జాతీయ ఆర్థిక సంస్థలుబహుళ పక్ష అభివృద్ధి బ్యాంకుల సమగ్ర సంస్కరణకు ప్రాధాన్యం ఇవ్వాలివీటిని ప్రస్తుత ప్రాపంచిక వాస్తవాలుఅభివృద్ధి చెందుతున్న దేశాల అవసరాలుఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాస్వామ్యసమానమైనప్రాతినిధ్య ప్రతిస్పందనకు తగ్గట్టుగా చేపట్టాలి

18. వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ (యుఎన్ ఎఫ్ సిసిసిలోని 'ఉమ్మడి అయినప్పటికీ  భిన్నమైన బాధ్యతలు సంబంధిత సామర్థ్యాలు' (సిబిడిఆర్-ఆర.సి సూత్రం అన్ని సంబంధిత ప్రపంచ సవాళ్లకు వర్తిస్తుందని గుర్తించిఅభివృద్ధి చెందుతున్న దేశాల సమస్యలకు,  ప్రాధాన్యతలకు ప్రతిస్పందించే సమ్మిళిత సమతుల్య అంతర్జాతీయ ఎజెండా కోసం పిలుపునివ్వాలి.  


19. హిందూ మహాసముద్ర రిమ్ అసోసియేషన్ (ఐఓఆర్ఏ), బే ఆఫ్ బెంగాల్ (బంగాళాఖాతంఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ (బిమ్ స్టెక్), ఇండోనేషియా-మలేషియా-థాయ్ లాండ్ గ్రోత్ ట్రయాంగిల్ (ఐఎంటిజిటి), సింగపూర్-జొహోర్-రియావ్ ఎస్ఐజిఒఆర్ఐగ్రోత్ ట్రయాంగిల్బ్రూనై దారుస్సలాం-ఇండోనేషియా-మలేషియా-ఫిలిప్పీన్స్ తూర్పు ఆసియాన్ గ్రోత్ ఏరియా (బిఐఎంపిఇఎజిఎవంటి ఉప-ప్రాంతీయ వ్యవస్థలతో సమన్వయాలను గుర్తించాలిమెకాంగ్-గంగా కోఆపరేషన్ (ఎంజిసి), అయ్యవాడీ చావో ఫ్రాయా-మెకాంగ్ ఎకనామిక్ కోఆపరేషన్ స్ట్రాటజీ (ఎసిఎంఇసిఎస్సహా మెకాంగ్ ఉప-ప్రాంతీయ సహకార వ్యవస్థలతో కూడా సమన్వయం ఉండాలిఉప ప్రాంతీయ అభివృద్ధిని ఆసియాన్ భారత్ ల మగ్రపరస్పర అభివృద్ధితో సమన్వయం చేయడం ద్వారా వీటి మధ్య సమానమైన అభివృద్ధిని ప్రోత్సహించే ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలి.

20. ఆసియాన్-ఇండియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా మన భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తూనే ఆందోళన కలిగించే ఉమ్మడి ప్రాంతీయ అంతర్జాతీయ సమస్యలపై కలిసి పనిచేయడం కొనసాగించాలి

 

***



(Release ID: 2064322) Visitor Counter : 20