ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

లావో పీడీఆర్‌లో 21వ ఆసియాన్-ఇండియా సదస్సు ముగింపు సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

Posted On: 10 OCT 2024 8:07PM by PIB Hyderabad

గౌరవ దేశాధినేతలకు,

నమస్కారం!

ఈరోజు సానుకూల చర్చల్లో పాలుపంచుకుని, మీ విలువైన అవగాహనను, సూచనలను వెల్లడించిన మీ అందరికీ నా కృతజ్ఞతలు.

ఈనాటి ఈ సదస్సును విజయవంతంగా నిర్వహించిన ప్రధాన మంత్రి సోనెక్సే సిఫాండోన్‌కు సైతం నేను నా హృదయపూర్వక కృతజ్ఞలు తెలియజేస్తున్నాను.

డిజిటల్ పరివర్తన బలోపేతం కోసం ఆమోదం తెలుపుతూ మనం రెండు సంయుక్త ప్రకటనలు చేశాం. మన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం భవిష్యత్తులో మన సహకారానికి పునాది వేస్తుంది. ఈ సదస్సును విజయవంతం చేసిన అందరినీ నేను అభినందిస్తున్నాను.

గత మూడు సంవత్సరాలుగా ఆసియాన్‌లో భారత్ కోసం కంట్రీ కోఆర్డినేటర్‌గా సానుకూల పాత్ర పోషించిన సింగపూర్‌కు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ మద్దతుకు ధన్యవాదాలు. భారత్-ఆసియాన్ సంబంధాలలో మనం అపూర్వమైన పురోగతిని సాధించాం. మా కొత్త కంట్రీ కోఆర్డినేటర్‌గా ఫిలిప్పీన్స్‌ను నేను స్వాగతిస్తూ, నా అభినందనలు తెలుపుతున్నాను.

రెండు బిలియన్ల ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం, ప్రాంతీయ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సుల కోసం మన పరస్పర సహకారం కొనసాగుతూ ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను.

ఆసియాన్ చైర్మన్‌గా విజయంవంతంగా బాధ్యతలు నిర్వహించిన లావో పీడీఆర్ ప్రధానికి మరోసారి నేను నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.

తదుపరి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్న మలేషియాకు 140 కోట్ల మంది భారతీయుల పక్షాన నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

చైర్మన్‌గా మీ విజయంలో భారత్ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది.

ధన్యవాదాలు!

గమనిక: ఇది ప్రధానమంత్రి వ్యాఖ్యలకు దాదాపు అనువాదం మాత్రమే. వాస్తవానికి ఆయన హిందీలో మాట్లాడారు.

 

***



(Release ID: 2064013) Visitor Counter : 31