రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

‘స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడంలో ఆధ్యాత్మికత్వం అండదండలు’ అనే అంశంపై ప్రపంచ స్థాయి శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న భారత రాష్ట్రపతి

Posted On: 04 OCT 2024 11:36AM by PIB Hyderabad

‘స్వచ్ఛమైన, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడంలో ఆధ్యాత్మికత్వం అండదండలు’ ఇతివృత్తంతో నిర్వహించిన ప్రపంచ స్థాయి శిఖరాగ్ర సమావేశంలో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు.  ఈ సమావేశాన్ని ప్రజాపతి బ్రహ్మ కుమారీల ఈశ్వరీయ విశ్వ విద్యాలయం రాజస్థాన్ లోని మౌంట్ ఆబూ లో ఈ రోజు ఏర్పాటు చేసింది.



ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రసంగిస్తూ, ఆధ్యాత్మికత్వం అంటే ధర్మపరంగా నడచుకోవడమో లేదా ప్రాపంచిక కార్యకలాపాలను వదలి పెట్టేయడమో కాదన్నారు.  ఆధ్యాత్మికత్వం అంటే మన లోపల ఉన్న శక్తిని గుర్తించడం, మన నడవడికలో, మన ఆలోచనలలో పవిత్రత్వానికి ప్రాధాన్యాన్ని ఇవ్వడం అని అర్థం అని ఆమె అన్నారు.  భావాలలో స్వచ్ఛత తో పాటు మనం చేసే పనులలో నిష్కల్మషత్వం.. వీటి సాయంతో జీవనంలో మనం వేసే ప్రతి అడుగులోనూ పట్టు తప్పిపోకుండా నడుస్తూ, మనస్సులో నెమ్మదిగా ఉంటూ మనుగడను సాగించాలని ఆమె అన్నారు. స్వచ్ఛమైనటువంటి, ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించడానికి కూడా ఇది అవసరమే అని రాష్ట్రపతి అన్నారు.



శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా స్వచ్ఛతను కలిగివుంటే ఆరోగ్య ప్రదమైన జీవనాన్ని గడవగలుగుతాం అని రాష్ట్రపతి అన్నారు.  మనం బాహ్య స్వచ్ఛత పైనే దృష్టిని కేంద్రీకరించకూడదని, మానసికంగా, ఆధ్యాత్మికత్వం పరంగా కూడా నిర్మలత్వంతో నడుచుకోవాలి అని ఆమె అన్నారు.  మన మనస్తత్వం పరిశుభ్రంగా ఉందా లేదా అన్నదానిపైనే మనం ఎంతగా స్వస్థంగా ఉండగలం అన్నది ఆధారపడి ఉంటుందన్నారు.  మనం ఏమి ఆలోచిస్తామన్న దానిని బట్టే మన ప్రవర్తన, మనం ఆడే మాటలు ఉంటాయి;  ఈ కారణంగా మన ఆలోచనలు సరి అయినవిగా ఉన్నాయంటే అప్పుడు మనం మానసికంగాను, భావోద్వేగాల పరంగాను ఆరోగ్యంగా ఉంటాం.  ఇతరులను గురించి ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకొనే ముందు మనం మన అంతరంగంలోకి తొంగి చూసుకోవాలి. ఎవరికో ఎదురైన స్థితి మనకు ఎదురైతే అని తలపోసినప్పుడు, మనం సరి అయినటువంటి అభిప్రాయాన్ని ఏర్పరచుకొనే స్థితిలో ఉండగలం అని ఆమె అన్నారు.
 


ఆధ్యాత్మికత అనేది వ్యక్తిగత ఎదుగుదలకు తోడ్పడే ఒక సాధనం మాత్రమే కాదని, అది సంఘంలో ఒక సానుకూల మార్పును తీసుకు వచ్చే మార్గం అని రాష్ట్రపతి అన్నారు.  మనం మన అంతరంగంలోని పరిశుద్ధతను గుర్తించినప్పుడే ఆరోగ్యకరమైన, శాంతియుక్తమైన సమాజాన్ని ఆవిష్కరించడానికి తోడ్పడగలం అని ఆమె అన్నారు. సమాజానికి సంబంధించిన, భూమికి సంబంధించిన అనేక అంశాలకు.. ఉదాహరణకు కు సుస్థిరాభివృద్ధి, పర్యావరణ సంరక్షణ, సామాజిక న్యాయం వంటి అంశాలకు.. బలాన్ని ఆధ్యాత్మికత్వం అందిస్తుందని రాష్ట్రపతి అన్నారు.



రకరకాల వస్తువుల ను సొంతం చేసుకొని, వాటి పట్ల ప్రీతిని కలిగివుండడం అనేది  మనకు క్షణికమైన భౌతిక, మానసిక సంతోషాన్ని కలిగిస్తుంది, దీనినే నిజమైన ఆనందం అని మనం అనుకొని, దీనితో పెనవేసుకుపోతాం అని రాష్ట్రపతి అన్నారు.  ఈ బంధం మనలో అసంతృప్తిని, దుఃఖాన్ని జనింపచేస్తుంది.  మరో పక్క, ఆధ్యాత్మికత మన గురించి మనం తెలుసుకొనే, మన అంతరంగాన్ని మనం గుర్తెరిగే అవకాశాలను ప్రసాదిస్తుంది అని రాష్ట్రపతి అన్నారు

వర్తమాన ప్రపంచంలో శాంతికి, ఏకత్వానికి ప్రాముఖ్యం మరింత పెరిగిపోయింది అని రాష్ట్రపతి అన్నారు.  మనం శాంతిగా ఉంటేనే ఇతరుల పట్ల సానుభూతిని, ప్రేమను చాటగలుగుతాం.  యోగా చెప్పే విషయాలు, బ్రహ్మకుమారీల వంటి ఆధ్యాత్మిక సంస్థలు మనం మన మనస్సులో శాంతిని ఏర్పరచుకొనేందుకు తోడ్పడుతాయి.  ఈ శాంతి ఒక్క మన లోపల  సానుకూల పరివర్తనను తేవడమే కాకుండా పూర్తి సమాజంలో సైతం సానుకూల పరివర్తనను కొనితేగలదని రాష్ట్రపతి అన్నారు.

***


(Release ID: 2062015) Visitor Counter : 64