ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మరాఠీ, పాలీ, ప్రాకృతం, అస్సామీ, బెంగాలీ భాషలకు శాస్త్రీయ భాష హోదాను ఇస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకొన్నందుకు ప్రధాన మంత్రి హర్షం

Posted On: 03 OCT 2024 10:05PM by PIB Hyderabad

 

మరాఠీ, పాలీ, ప్రాకృతం, అస్సామీ, బెంగాలీ భాషలకు శాస్త్రీయ భాష హోదాను ఇవ్వాలన్న నిర్ణయాన్ని మంత్రివర్గం తీసుకొన్నందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి తన స్పందనను సామాజిక ప్రసార మాధ్యమ వేదిక  ‘ఎక్స్’ లో ఈ కింది విధంగా వ్యక్తం చేశారు:

‘‘అస్సామీ భాషకు శాస్త్రీయ భాష హోదాను ఇవ్వాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదాన్ని తెలిపిన నేపథ్యంలో, ఆ భాషకు లభించిన గౌరవానికి గాను నేను ఎంతో సంతోషిస్తున్నాను. అస్సామీయుల సంస్కృతి శతాబ్దాలుగా వర్ధిల్లుతూ ఉంది.  అస్సామీ సంస్కృతి మనకు గొప్ప సాహిత్య పరంపరను అందించింది.  రాబోయే కాలాల్లో ఈ భాష మరింత ఎక్కువ మంది ప్రజల ఆదరణను చూరగొంటూ ఉండాలని నేను ఆకాంక్షిస్తున్నాను.  ఈ సందర్భంగా ఇవే నా అభినందనలు.’’

‘‘ఘనమైన బెంగాలీ భాషకు శాస్త్రీయ భాష హోదాను ఇచ్చినందుకు, అది కూడా మంగళప్రదమైన ‘దుర్గా పూజ’ కాలంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నందుకు  నేను చాలా ఆనందిస్తున్నాను.  బెంగాలీ సాహిత్యం ఏళ్ళ తరబడి అసంఖ్యాక వ్యక్తులకు ప్రేరణనిచ్చింది.  ప్రపంచమంతటా బెంగాలీ భాషను మాట్లాడుతున్న వారందరినీ ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను.

‘‘మరాఠీ భాష దేశానికి గర్వకారణం.

ఈ మహత్తర భాషకు ‘శాస్త్రీయ భాష’ హోదాను కట్టబెడుతున్నందుకు అభినందనలు.  ఈ గౌరవం మన దేశ చరిత్రకు సంస్కృతిపరంగా మరాఠీ భాష అందించిన ఘనమైన తోడ్పాటును గుర్తిస్తున్నది.  భారతదేశ వారసత్వ సమున్నత భవనానికి ఒక మూలస్తంభంగా మరాఠీ భాష నిలుస్తూ వచ్చింది.

శాస్త్రీయ భాష హోదా లభించడంతో మరాఠీ భాషను నేర్చుకోవాలన్న ప్రేరణను మరింత ఎక్కువ మంది తప్పక పొందుతారని నేను నమ్ముతున్నాను.

‘‘పాలీ మరియు ప్రాకృత భాషలు భారతదేశ సంస్కృతికి ఆధారభూతంగా ఉన్నాయి.  ఈ భాషలు ఆధ్యాత్మికత్వం, జ్ఞానం, ఇంకా తాత్వికత మూర్తీభవించిన భాషలు.  అవి వాటి సాంస్కృతిక సంప్రదాయాలకు కూడా ప్రసిద్ధి చెందాయి.  వాటిని శాస్త్రీయ భాషలుగా గుర్తించడం అంటే అది భారతీయ తత్త్వదర్శనం, సంస్కృతి, ఇంకా చరిత్రలపై ఆయా భాషలు నిరంతరంగా ప్రసరిస్తున్నటువంటి ప్రభావాన్ని సమాదరించడమే అవుతుంది.’’

ఈ రెండు భాషలకు శాస్త్రీయ భాషలుగా గుర్తింపును ఇస్తూ, మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడంతో మరింత ఎక్కువ మంది ప్రజలు ఆ భాషలను నేర్చుకోవాలన్న స్ఫూర్తిని పొంది తీరుతారన్న నమ్మకం నాలో ఏర్పడింది.  ఇది నిజంగానే ఒక ఉల్లాసభరితమైన క్షణం సుమా.’’

 

***


MJPS/TS


(Release ID: 2061956)