ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘భారత్ లో తయారీపై ప్రపంచం దృష్టి' శీర్షికతో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ రాసిన వ్యాసాన్ని షేర్ చేసిన ప్రధాన మంత్రి కార్యాలయం

प्रविष्टि तिथि: 27 SEP 2024 1:15PM by PIB Hyderabad

‘భారత్ లో తయారీపై ప్రపంచం దృష్టి' అనే శీర్షికతో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ రాసిన ఒక వ్యాసాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎమ్ఓ) షేర్  చేసింది.

కేంద్ర మంత్రి ఎక్స్ లో పెట్టిన ఒక పోస్ట్ ను ప్రధాన మంత్రి కార్యాలయం షేర్ చేస్తూ,

‘‘భారతదేశాన్ని పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువగా ఇష్టపడే గమ్యస్థానం గా ‘మేక్ ఇన్ ఇండియా’ (@makeinindia) ఏ విధంగా నిలబెట్టిందీ కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ (@PiyushGoyal) ప్రముఖంగా ప్రస్తావించారు. అలాగే, ఈ ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం వ్యాపార సంస్థలకు- ప్రత్యేకించి సూక్ష్మ, లఘు, మధ్య తరహా వాణిజ్య వ్యవస్థ (ఎమ్ఎస్ఎమ్ఇ) లకు- అధిక నాణ్యత కలిగిన ఉత్పాదనలను తయారు చేసే సాధికారితను కల్పించడమే కాకుండా, అనేక రంగాలను అవి అప్రామాణిక ఉత్పాదనలను దిగుమతి చేసుకొంటున్న స్థితి నుంచి ప్రపంచ శ్రేణి వస్తువులను ఎగుమతి చేసే సామర్థ్యం కలిగినవిగా తీర్చిదిద్దింది అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.’’ అని తెలిపింది.

 

***


(रिलीज़ आईडी: 2059716) आगंतुक पटल : 85
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , Tamil , Marathi , English , Urdu , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Kannada , Malayalam