ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

డిజిటల్ ప్రజా మౌలిక సదూపాయాల అభివృద్ధి, విస్తరణకు క్వాడ్ సూత్రాలు

Posted On: 21 SEP 2024 11:55PM by PIB Hyderabad

1. ఐక్యరాజ్యసమితి 2030 ఎజెండా అయిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనను వేగవంతం చేసేందుకు డిజిటల్ సాంకేతికత వ్యవస్థ ద్వారా సమాజాన్ని పెద్దఎత్తున మార్చగలిగే సామర్థ్యం ఉందని క్వాడ్ సభ్య దేశాలైన మేము అంగీకరిస్తున్నాం. భాగస్వామ్య శ్రేయస్సును, సుస్థిరాభివృద్ధి లక్ష్య సాధనలో డిజిటలీకరణ సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకుంటూనే... సమ్మిళిత, బహిరంగ, సుస్థిర, న్యాయమైన, సురక్షితమైన, నమ్మదగిన డిజిటల్ భవిష్యత్తును పెంపొందించాల్సిన ప్రాముఖ్యతను మేము విశ్వసిస్తున్నాం.

2. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డిపిఐ) అనేది ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న భావన. సురక్షితమైన, నమ్మదగిన, పరస్పరం కలిసి పనిచేయగలిగే డిజిటల్ వ్యవస్థల సమూహం. ఇది ప్రజలందరికీ సమాన అవకాశాలను అందించడానికి, ప్రజా సేవలను మెరుగుపరచడంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు అభివృద్ధిపరిచి, ఉపయోగిస్తున్న వ్యవస్థ. అభివృద్ధి, చేరిక, సృజనాత్మకత, విశ్వాసం, పోటీ, మానవ హక్కులు, ప్రాథమిక స్వేచ్ఛలను గౌరవించడానికి సమానమైన, న్యాయమైన పోటీని అందించే చట్టపరమైన విదివిధానాలు, నిబంధనల ద్వారా డిపిఐ పని చేస్తుంది. మానవ హక్కులను గౌరవిస్తూ, ప్రజాస్వామ్య సూత్రాలను పాటించే విధంగా దీనిని అమలు చేయడానికి ప్రాథమిక స్వేచ్ఛలకు.. రక్షణలు, బలమైన సైబర్ భద్రతా ప్రమాణాలు అవసరం. డిపిఐని అమలు చేసే ప్రభుత్వాలన్ని డిజిటల్ అంతరాలను తొలగించే సమష్టి ప్రయత్నాలలో నిమగ్నం కావాలి.

3. ఈ దిశగా, డిపిఐ అభివృద్ధి, అమలు కోసం మేము ఈ క్రింది సూత్రాలను ధ్రువీకరిస్తున్నాం.

i. సమ్మిళితత్వం: సమాజంలో ప్రతి ఒక్కరికీ ప్రయోజనం కలిగేటట్లు చూడటానికి, అన్ని ప్రాంతాలకు సేవలను అందుబాటులోకి తేవదానికి, తప్పుడు పరిష్కారాలను నివారించే దిశగా  ఆర్ధిక, సాంకేతిక లేదా సామాజిక అంతరాలను తొలగించడం లేదా తగ్గించడం.

ii. ఇంటర్‌ఆపరేబిలిటీ (సమాచార మార్పిడి, వినియోగం): దీని కోసం తగిన చర్యలు తీసుకుంటున్నప్పుడు  చట్టపరమైన అంశాలు, సాంకేతిక పరిమితులను దృష్టిలో ఉంచుకొని..., సాధ్యమైనంత వరకు సాంకేతిక తటస్థ విధానంతో ఓపెన్ స్టాండర్డ్ విధానాన్ని అవలంబించడం.

iii. మాడ్యులారిటీ, ఎక్స్‌టెన్సిబిలిటీ (విస్తరణ సామర్థ్యం): ఎలాంటి అంతరాయాలు లేకుండా మార్పులు, చేర్పులకు అనుగుణంగా బ్లాక్ ల నిర్మాణం లేదా మాడ్యులర్ నిర్మాణాలను ఈ మాడ్యులారిటీ, విస్తరణ సామర్థ్య విధానం సూచిస్తుంది.

iv. స్కేలబిలిటీ (విస్తీర్ణాన్ని మార్చగలిగే సామర్థ్యం): డిమాండ్‌లో ఏదైనా ఊహించని పెరుగుదలను సులభంగా సర్దుబాటు చేయడానికి, లేదా ఇప్పటికే ఉన్న వ్యవస్థను మార్చకుండా విస్తరణ అవసరాలను తీర్చడానికి సరళమైన డిజైన్ ఉపయోగించడం.

v. భద్రత, గోప్యత: తగిన రక్షణాత్మక ప్రమాణాల ఆధారంగా, వ్యక్తిగత గోప్యత, డేటా రక్షణను నిర్ధారించడానికి సాంకేతికత, భద్రతా లక్షణాలను కోర్ డిజైన్ లో పొందుపరిచే విధానాన్ని అవలంబించడం.

vi. సహకారం: సహకార సంస్కృతిని సులభతరం చేయడానికి, ప్రోత్సహించడానికి ప్రణాళిక, రూపకల్పన, నిర్మాణం, నిర్వహణ వంటి వివిధ దశలలో సమాజంలోని కళాకారుల సాయం తీసుకోవడం. వినియోగదారు-కేంద్రీకృత పరిష్కారాల అభివృద్ధికి వీలు కల్పించడం, సుస్థిరమైన విస్తృత అంగీకారాన్ని పొందడం, ఆవిష్కర్తలు కొత్త అంశాలను అభివృద్ధి చేయడానికి అనుమతించడం.

vii. ప్రజా ప్రయోజనం, విశ్వాస పారదర్శకత కోసం పాలన: రూపొందించిన విధివిధానాలను గౌరవిస్తూనే ప్రజా ప్రయోజనం, విశ్వాసం, పారదర్శకతను పెంపొందించడం. చట్టాలు, నిబంధనలు, విధానాలు, సామర్థ్యాలు ఈ వ్యవస్థలు సురక్షితమైనవి, విశ్వసనీయమైనవి పారదర్శకంగా నిర్వహించబడతాయని ఇది తెలుపుతుంది. వ్యవస్థలో పోటీని, చేరికను ప్రోత్సహిస్తూ, డేటా సంరక్షణ, గోప్యత సూత్రాలకు కట్టుబడి ఉండాలని సూచిస్తుంది.

viii. ఫిర్యాదుల పరిష్కారం: ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాప్యతను, పారదర్శక యంత్రాంగాలను ఇది నిర్వచిస్తుంది. యూజర్ టచ్ పాయింట్‌లు, వివిధ ప్రక్రియలు, బాధ్యతాయుతమైన సంస్థలు, పరిష్కార చర్యలపై బలమైన దృష్టిని కేంద్రీకరిస్తుంది.

ix. సుస్థిరత: నిరాటంక కార్యకలాపాలు, అంతరాయం లేని వినియోగదారు కేంద్రీకృత సేవలు పొందడాన్ని సులభతరం చేసేందుకు తగిన ఆర్థిక, సాంకేతిక మద్దతు పెంపొందిస్తుంది. మెరుగుదలను నిర్థారించడం ద్వారా సుస్థిరతను ధ్రువీకరిస్తుంది.

x. మానవ హక్కులు: ప్రణాళిక, రూపకల్పన, నిర్మాణం, నిర్వహణ... ప్రతి దశలో మానవ హక్కులను గౌరవించే విధానాన్ని అవలంబించడం.

xi. మేధో సంపత్తి పరిరక్షణ: ఇప్పటికే ఉన్న చట్టపరమైన విధానాల ఆధారంగా ఉపయోగించే సాంకేతికతలు, ఇతర హక్కులను కలిగి ఉన్నవారికి మేధో సంపత్తి హక్కుల సమర్థవంతమైన రక్షణను అందించడం.

xii. సుస్థిరాభివృద్ధి: సుస్థిర అభివృద్ధి కోసం ఐక్యరాజ్యసమితి 2030 ఎజెండా అమలుకు, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు దోహదపడే ఈ వ్యవస్థలను అభివృద్ధిపర్చడానికి, అమలు చేయడానికి ప్రయత్నించడం.


 

***


(Release ID: 2058458) Visitor Counter : 33