ఆర్థిక మంత్రిత్వ శాఖ
18 న ఎన్పిఎస్ వాత్సల్య పథకాన్ని ప్రారంభించనున్న కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా 75 ప్రాంతాల్లోనూ ప్రారంభం
ప్రాణ్ కార్డులతో ఎన్పీఎస్ వాత్సల్యలోకి బాల చందాదారులు
ఎన్పీఎస్ వాత్సల్య ద్వారా చిన్న వయసులోనే ఆర్ధిక భద్రతను ప్రోత్సహించడం ప్రభుత్వ ప్రధానోద్దేశం
Posted On:
16 SEP 2024 5:38PM by PIB Hyderabad
2024-25 కేంద్ర బడ్జెట్‌లో చేసిన ప్రకటనకు అనుగుణంగా, కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ సెప్టెంబర్ 18 న న్యూఢిల్లీలో ఎన్పీఎస్ వాత్సల్య పథకాన్ని ప్రారంభించనున్నారు. పాఠశాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఈ కార్యక్రమంలో ఆన్‌లైన్ ద్వారా ఎన్పీఎస్ వాత్సల్యను ప్రారంభించడంతో పాటు పథక వివరాలకు సంబంధించిన బ్రోచర్ ను కేంద్రమంత్రి విడుదల చేస్తారు. ఇదే సమావేశంలో పలువురు బాల చందాదారులకు పర్మనెంట్ రిటైర్‌మెంట్ ఎకౌంట్ నంబర్(ప్రాణ్) ను అందచేస్తారు.
న్యూఢిల్లీతోపాటు, దేశవ్యాప్తంగా ఏకకాలంలో దాదాపు 75 ప్రాంతాల్లో ఎన్పీఎస్ వాత్సల్య కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. వీరందరూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆయా ప్రాంతాల్లో కొత్త బాల చందాదారులకు ప్రాణ్ సభ్యత్వాన్ని ఇస్తారు.
ఎన్పీఎస్ వాత్సల్య పథకం ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల పేరిట తెరిచే పెన్షన్ ఖాతాలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇలా పెట్టె పెట్టుబడి దీర్ఘ కాలంలో ఇంతలింతలుగా పెరిగి గణనీయమైన ఆదాయాన్ని అందిస్తుంది ఎవరి స్థోమతకు తగ్గట్లు వారు వివిధ మార్గాల్లో పెట్టుబడి పెట్టుకునే అవకాశాన్ని ఈ పథకం కల్పిస్తోంది. ఈ పథకం కింద ఏడాదికి కనీసం 1000 రూపాయలు చొప్పున పిల్లల పేరిట పెట్టుబడి పెట్టవచ్చు. తద్వారా అన్ని రకాల ఆదాయ వర్గాలకు ఈ పథకం అందుబాటులో ఉంటుందన్న మాట.
ఈ కొత్త పథకం పిల్లల ఆర్థిక భవిష్యత్తుకు ముందస్తు భరోసాను కల్పించే ఉద్దేశంతో రూపొందించారు. ఇది దేశ పెన్షన్ వ్యవస్థలో ఒక ముఖ్యమైన మార్పునకు నిదర్శనం. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) ఆధ్వర్యంలో ఈ పథకం నడుస్తుంది.
ప్రతి కుటుంబ దీర్ఘకాలిక భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని... వారికి ఆర్ధిక భరోసా ఉండేలా చూడాలన్న ప్రభుత్వ దృక్పథానికి ఈ పథకం ఒక నిదర్శనం. దేశ భవిష్యత్ తరాలను మరింత ఆర్థికంగా సురక్షితంగా, స్వతంత్రంగా మార్చే దిశగా ఇది ఒక గొప్ప నిర్ణయం.
****
(Release ID: 2055847)
Visitor Counter : 123
Read this release in:
Odia
,
Bengali
,
English
,
Khasi
,
Urdu
,
Marathi
,
Hindi
,
Nepali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam