ప్రధాన మంత్రి కార్యాలయం
సింగపూర్ సీనియర్ మంత్రి లీ సెయిన్ లూంగ్ తో ప్రధాని సమావేశం
Posted On:
05 SEP 2024 2:18PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ సింగపూర్ మాజీ ప్రధాని, ప్రస్తుతం సీనియర్ మంత్రిగా వ్యవహరిస్తోన్న లీ సీన్ లూంగ్ తో ఈరోజు సమావేశమయ్యారు. ప్రధాని గౌరవార్థం సీనియర్ మంత్రి విందు ఏర్పాటు చేశారు.
భారత్, సింగపూర్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం పెంపొందించడంలో సీనియర్ మంత్రి లీ పోషించిన పాత్రను ప్రధానమంత్రి కొనియాడారు. సీనియర్ మంత్రిగా కొత్త బాధ్యతల నిర్వహణలో సైతం భారత్ తో సింగపూర్ సంబంధాలపై దృష్టి సారించి మార్గదర్శకం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
గతంలో జరిగిన సమావేశాలను గుర్తు చేసుకుంటూ భారత్-సింగపూర్ సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం దిశగా పురోగతి సాధించడంపై ప్రధాని, సీనియర్ మంత్రి లీ సంతృప్తి వ్యక్తం చేశారు. మరిన్ని అంశాలు చేపట్టేందుకు ముఖ్యంగా ఇరు దేశాల మంత్రుల మధ్య జరిగిన రెండు రౌండ్ టేబుల్ సమావేశాల్లో గుర్తించిన సహకార అంశాలు సాధించే సామర్థ్యం ఉందని అంగీకరించారు. ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి, పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై వారు తమ ఆలోచనలు పంచుకున్నారు.
(Release ID: 2052188)
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam