ప్రధాన మంత్రి కార్యాలయం
పురుషుల క్లబ్ త్రో పోటీలో రజత పతకాన్ని గెలిచిన ప్రణవ్ సూర్మా కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అబినందనలు
Posted On:
05 SEP 2024 8:05AM by PIB Hyderabad
పారిస్ లో జరుగుతున్న పారాలింపిక్స్ లో పురుషుల క్లబ్ త్రో ఎఫ్51 (దుడ్డుకర్ర ను విసిరే) పోటీలో వెండి పతకాన్ని గెలిచిన క్రీడాకారుడు శ్రీ ప్రణవ్ సూర్మా కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందనలు తెలిపారు. శ్రీ ప్రణవ్ సూర్మా పట్టుదలను, దృఢ దీక్షను ప్రధాని ప్రశంసించారు.
శ్రీ నరేంద్ర మోదీ ‘ఎక్స్’ లో ఒక సందేశంలో ఈ కింది విధంగా పేర్కొన్నారు:
‘‘పారాలింపిక్స్ 2024 (#Paralympics2024) లో పురుషుల క్లబ్ త్రో ఎఫ్51 పోటీలో రజత పతకాన్ని గెలిచినందుకు ప్రణవ్ సూర్మా కు అభినందనలు. ఆయన సాధించిన విజయం ఎంతో మంది యువజనులకు ప్రేరణనిస్తుంది. ఆయనలోని దృఢ దీక్ష, పట్టుదల ప్రశంసనీయమైనవి.
చీర్ ఫర్ భారత్ (#Cheer4Bharat)’’
(Release ID: 2052092)
Visitor Counter : 56
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam