ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కాంస్యం సాధించిన సుందర్ సింగ్ గుర్జర్ కు ప్రధాని అభినందనలు

Posted On: 04 SEP 2024 10:25AM by PIB Hyderabad

పారిస్ లో జరుగుతున్న పారాలింపిక్స్ లో పురుషుల జావెలిన్ త్రో ఎఫ్46 విభాగంలో కాంస్యం గెలుపొందిన సుందర్ సింగ్ గుర్జర్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు అభినందించారు.

ప్రధానమంత్రి ‘ఎక్స్’ లో చేసిన పోస్ట్:

‘‘పారాలింపిక్స్ 2024లో పురుషుల జావెలిన్ త్రోలో సుందర్ సింగ్ గుర్జర్ అద్భుత ప్రదర్శన చేసి కాంస్యం సాధించారు. ఆయన అంకితభావం, ఆటతీరు అత్యద్భుతం. ఈ విజయానికి అభినందనలు! #Cheer4Bharat’’.

 

 

 

***

MJPS/ST


(Release ID: 2051718) Visitor Counter : 48