ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి ఉక్రెయిన్ పర్యటన (2024 ఆగస్టు 23) సందర్భంగా సంతకాలు పూర్తయిన పత్రాల జాబితా

Posted On: 23 AUG 2024 6:45PM by PIB Hyderabad

 

 

వ.సం.

పత్రం పేరు

లక్ష్యం

1

వ్యవసాయం, ఆహార పరిశ్రమ రంగాల్లో సహకారంపై భారత్-ఉక్రెయిన్ ఒప్పందం.

వ్యవసాయం, ఆహార పరిశ్రమ రంగాల్లో పరస్పర ప్రయోజనకర సహకారం విస్తరణ. ఈ దిశగా ఉమ్మడి శాస్త్రీయ పరిశోధనలు, సమాచారం-అనుభవాలు ఇచ్చిపుచ్చుకోవడం, వ్యవసాయ పరిశోధనలో సహకారం, సంయుక్త కార్యాచరణ బృందాల ఏర్పాటు వగైరాల్లో సంబంధాలకు  ప్రోత్సాహం

2

ఔషధ ఉత్పత్తుల నియంత్రణ రంగంలో సహకారంపై భారత ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ పరిధిలోని ‘సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్’, ‘స్టేట్ సర్వీస్ ఆఫ్ ఉక్రెయిన్ ఆన్ మెడిసిన్స్ అండ్ డ్రగ్స్ కంట్రోల్‌’ మధ్య అవగాహన ఒప్పందం (ఎఒయు).

ఔషధ ఉత్పత్తుల నియంత్రణ, భద్రత- నాణ్యత అంశాల మెరుగుదల తదితరాల్లో  సహకారం. ఈ దిశగా సమాచార ఆదానప్రదానం, సామర్థ్యం పెంపుదల, వర్క్‌ షాప్‌ల నిర్వహణ, శిక్షణ, నిపుణుల సందర్శన వంటివి ఇందులో ప్రధానాంశాలు.

3

సామాజిక ప్రగతిని ప్రభావితం చేయగల ఉన్నతస్థాయి అభివృద్ధి పథకాల (హెచ్ఐసిడిపి) అమలుకు భారత మానవతావాద ఆర్థిక సహాయానికి సంబంధించి భారత ప్రభుత్వం-ఉక్రెయిన్ మంత్రిమండలి మధ్య అవగాహన ఒప్పందం (ఎంఒయు).

ఈ ఒప్పందం కింద ఉక్రెయిన్‌లో సామాజిక ప్రగతిని ప్రభావితం చేయగల పథకాల అమలుకు భారత్ నుంచి ఆర్థిక సహాయం కోసం ఒక చట్రం రూపొందుతుంది. దీనికి అనుగుణంగా ఉక్రెయిన్ ప్రజా ప్రయోజనార్థం అక్కడి ప్రభుత్వ భాగస్వామ్యంతో ‘హెచ్ఐసిడిపి’ ప్రాజెక్టులు చేపడతారు.

4

భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ- ఉక్రెయిన్ సాంస్కృతిక-సమాచార విధాన మంత్రిత్వ శాఖ మధ్య 2024-2028 మధ్య సాంస్కృతిక సహకారం.

భారత్-ఉక్రెయిన్‌ల మధ్య సాంస్కృతిక సహకార బలోపేతం దీని లక్ష్యం. సాంస్కృతిక ఆదానప్రదానం, రంగస్థలం, సంగీతం, లలిత కళలు, సాహిత్యం, లైబ్రరీ/మ్యూజియం వ్యవహారాలు వంటి రంగాల్లో సహకారం, ప్రత్యక్ష/పరోక్ష సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ, ప్రోత్సాహం తదితరాలు ఈ ఒప్పందంలో అంతర్భాగంగా ఉంటాయి.

 

***


(Release ID: 2048544) Visitor Counter : 85