ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్స్ 2024 లో వరుసగా రెండోసారి “A+” రేటింగును పొందిన ఆర్బీఐ గవర్నరు శ్రీ శక్తికాంత దాస్ కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు

Posted On: 21 AUG 2024 9:33AM by PIB Hyderabad

గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్స్ 2024లో వరుసగా రెండో సారి “A+” (ఎ ప్లస్) రేటింగును పొందిన భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) గవర్నరు శ్రీ శక్తికాంత దాస్ కు ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు అభినందనలు తెలిపారు.

 

భారతీయ రిజర్వు బ్యాంకు ‘ఎక్స్’ లో పొందుపరచిన ఒక సందేశానికి శ్రీ నరేంద్ర మోదీ ప్రతిస్పందిస్తూ:

“ఆర్బీఐ గవర్నరు శ్రీ శక్తికాంత దాస్ (@DasShaktikanta) ఈ అసాధారణ కార్యాన్ని సాధించినందుకు, అదీనూ ఏకంగా రెండో సారి సాధించినందుకుగాను ఆయనకు అభినందనలు. ఇది ఆర్బీఐకి ఆయన వహిస్తున్న నాయకత్వానికే కాకుండా ఆర్థికవృద్ధికీ, స్థిరత్వానికీ లభించిన గుర్తింపు” అని పేర్కొన్నారు. 

 

 

***

MJPS/SR


(Release ID: 2047184) Visitor Counter : 86