ప్రధాన మంత్రి కార్యాలయం
పారిస్ ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన రెజ్లర్ అమన్ సెహ్రావత్ కు ప్రధాన మంత్రి అభినందన
प्रविष्टि तिथि:
09 AUG 2024 11:43PM by PIB Hyderabad
ఫ్రాన్స్ లోని పారిస్ లో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో పురుషుల ఫ్రీ స్టైల్ 57 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించిన రెజ్లర్ అమన్ సెహ్రావత్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అభినందించారు.
‘‘గర్వించేలా చేసిన మన రెజ్లర్లకు ధన్యవాదాలు.
పారిస్ ఒలింపిక్స్ లో పురుషుల ఫ్రీస్టైల్ 57 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించిన అమన్ సెహ్రావత్ కు అభినందనలు. ఆయన అంకితభావం, పట్టుదల స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ అద్భుత విజయంతో యావత్ దేశమూ సంబరాలు చేసుకుంటోంది’’ అని తన ఎక్స్ ఖాతాలో ప్రధాని పోస్ట్ చేశారు.
(रिलीज़ आईडी: 2046875)
आगंतुक पटल : 77
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Hindi_MP
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam