ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

త్రివర్ణం పతాకంపై 140 కోట్ల మంది భారతీయుల అపార గౌరవానికి ‘హర్ ఘర్ తిరంగా అభియాన్’ నిదర్శనం: ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

Posted On: 14 AUG 2024 9:10PM by PIB Hyderabad

   దేశవ్యాప్తంగా ‘ఇంటింటా త్రివర్ణం’ (హర్ ఘర్ తిరంగా) కార్యక్రమం ఉత్సాహంతో సాగుతుండటంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. త్రివర్ణంపై 140 కోట్లమంది భారతీయులకుగల అపార గౌరవాన్ని దేశమంతటా విశేష ప్రాచుర్యం పొందిన ఈ ఉద్యమం చాటిచెబుతోందని ఆయన పేర్కొన్నారు.

   ఈ నేపథ్యంలో తమిళనాడులోని రామేశ్వరం సమీపాన మండపమ్ వద్దగల భారత తీర రక్షకదళ స్థావరంలో ‘హర్ ఘర్ తిరంగా’ వేడుక దృశ్యాలను సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లోని ‘అమృత మహోత్సవం హ్యాండిల్’ ప్రజలతో పంచుకుంది.

దీనిపై స్పందిస్తూ ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:

‘‘ఇంటింటా త్రివర్ణం’ (#HarGharTiranga) కార్యక్రమం దేశమంతటా విశేష ప్రజాదరణ పొందింది. మువ్వన్నెల జెండాపై 140 కోట్ల మంది భారతీయుల అపార గౌరవాన్ని ఇది చాటిచెబుతోంది’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 


(Release ID: 2045526) Visitor Counter : 54