హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా న్యూఢిల్లీలోని తన నివాస భవనంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన #HarGharTiranga (హర్ ఘర్ తిరంగా) అభియాన్ లో భాగంగా యావత్తు భారతదేశం త్రివర్ణమయంగా మారుతోంది.

నేను ఈ రోజు న్యూ ఢిల్లీ లోని నా నివాసంలో తిరంగాను ఎగురవేశాను; దేశ విముక్తి కై తమ సర్వస్వాన్ని త్యాగం చేసిన వీరులను స్మరించుకొన్నాను.

కోట్లాది దేశ ప్రజల ఏకత్వానికి, విధేయతకు, గౌరవానికి ప్రతీక గా తిరంగా సదా రెపరెపలాడుతూనే ఉంటుంది

प्रविष्टि तिथि: 14 AUG 2024 11:27AM by PIB Hyderabad

‘హర్ ఘర్ తిరంగా అభియాన్’ లో భాగంగా మువ్వన్నెల జెండాను కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు (బుధవారం) న్యూ ఢిల్లీలో తన నివాస భవనంపై ఎగురవేశారు.

కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి ‘ఎక్స్’ లో -

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆరంభించిన #HarGharTiranga (హర్ ఘర్ తిరంగా) అభియాన్ లో భాగంగా భారతదేశమంతా మువ్వన్నెల జెండాల రెపరెపలతో కళకళలాడుతోంది.  ఈ రోజున న్యూఢిల్లీలోని నా నివాసంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాను; దేశ స్వాతంత్య్రం కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేసిన వీరులను స్మరించుకొన్నాను.  కోట్ల కొద్దీ దేశవాసుల ఏకత్వానికి, విధేయతకు, గౌరవానికి ఒక సంకేతంగా మువ్వన్నెల జెండా సదా రెపరెపలాడుతూనే ఉంటుంది’’ అని పేర్కొన్నారు.

 


(रिलीज़ आईडी: 2045167) आगंतुक पटल : 103
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Hindi_MP , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada