ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పారిస్ ఒలింపిక్స్ 2024 ముగిసినందున భార‌తీయ బృందానికి ప్ర‌ధాని ప్ర‌శంస‌లు

Posted On: 11 AUG 2024 11:40PM by PIB Hyderabad

ఫ్రాన్స్‌లోని పారిస్‌లో జ‌రిగిన 2024 ఒలింపిక్స్ ఆదివారం(11.08.2024) ముగిసిన నేప‌థ్యంలో భార‌తీయ బృందం చేసిన ప్ర‌య‌త్నాల‌ను ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌శంసించారు.

భార‌తీయ అథ్లెట్ల‌ను హీరోలుగా పేర్కొంటూ, వారి భ‌విష్య‌త్తు ల‌క్ష్యాల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

ఈ మేర‌కు 'ఎక్స్' మాధ్య‌మంలో ప్ర‌ధాన‌మంత్రి పోస్ట్ చేస్తూ:

"పారిస్ ఒలింపిక్స్ ముగిసిన నేప‌థ్యంలో మొత్తం ఆట‌ల్లో భార‌తీయ బృంద‌మంతా చేసిన ప్ర‌య‌త్నాల‌ను అభినందిస్తున్నాను. అథ్లెట్లు అంద‌రూ వారి అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌ను ఇచ్చి ప్ర‌తి భార‌తీయుడు వారి ప‌ట్ల గ‌ర్వ‌ప‌డేలా చేశారు. మ‌న క్రీడా హీరోల రాబోయే ల‌క్ష్యాల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నాను."

 

 

 

***

MJPS/SR/RT


(Release ID: 2044466) Visitor Counter : 74