హోం మంత్రిత్వ శాఖ

ఇండో-బాంగ్లాదేశ్ బార్డర్ (ఐబిబి) లో ప్రస్తుత స్థితిని పర్యవేక్షించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసిన భారత ప్రభుత్వం


బాంగ్లాదేశ్ లో భారతీయ మూలాలున్న పౌరులతో పాటు అల్పసంఖ్యాక సముదాయాలకు చెందిన ప్రజల సురక్షకు పూచీ పడటానికి బాంగ్లాదేశ్ లోని సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరపనున్న కమిటీ

Posted On: 09 AUG 2024 3:06PM by PIB Hyderabad

ఇండో-బాంగ్లాదేశ్ బార్డర్ (ఐబిబి)లో ప్రస్తుతం నెలకొన్న స్థితిని పర్యవేక్షించడానికి ఒక కమిటీని భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది.  ఈ కమిటీ బాంగ్లాదేశ్ లో భారతీయ మూలాలున్న పౌరులతో పాటు అల్పసంఖ్యాక సముదాయాలకు చెందిన ప్రజల సురక్షకు కూడా తగిన జాగ్రతచర్యలను తీసుకొనేటట్టుగా చూసేందుకు బాంగ్లాదేశ్ లోని సంబంధిత అధికారులతో తరచుగా సంప్రదింపులను జరుపుతుంది.

 

సరిహద్దు భద్రత దళం (బిఎస్ఎఫ్) ఈస్టర్న్ కమాండ్ ఎడిజి ఈ కమిటీకి అధ్యక్షత వహిస్తారు; బిఎస్ఎఫ్ ఫ్రంటియర్ హెడ్ క్వార్టర్స్ సౌథ్ బెంగాల్ ఐజిబిఎస్ఎఫ్ ఫ్రంటియర్ హెడ్ క్వార్టర్స్ త్రిపుర ఐజిలాండ్ పోర్ట్స్ ఆథారిటి ఆఫ్ ఇండియా (ఎల్‌పిఎఐ)లోని మెంబర్ (ప్రణాళిక రూపకల్పన-అభివృద్ధి) లతో పాటు ఎల్‌పిఎఐ కార్యదర్శి ఈ కమిటీలో ఇతర సభ్యులుగా ఉంటారు.

 

**



(Release ID: 2043702) Visitor Counter : 12