ప్రధాన మంత్రి కార్యాలయం
పౌరులు వారి సామాజిక ప్రసార మాధ్యమాల ప్రొఫైల్ పిక్చర్ ను మువ్వన్నెల పతాకంతో మార్పు చేసుకోవలసిందిగా ప్రధాన మంత్రి విజ్ఞప్తి
త్రివర్ణ పతాకం తో దిగిన సెల్ఫీని harghartiranga.com లో షేర్ చేయండని కూడా ప్రధాన మంత్రి కోరారు
Posted On:
09 AUG 2024 9:01AM by PIB Hyderabad
సామాజిక మాధ్యమ వేదికలలో పౌరులు వారి ప్రొఫైల్ పిక్చరును త్రివర్ణ పతాక చిత్రంతో మార్పు చేసుకోవలసిందిగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. స్వాతంత్య్ర దినాన్ని పండుగలాగా జరుపుకోవడానికని శ్రీ నరేంద్ర మోదీ తన ప్రొఫైల్ పిక్చరు ను మువ్వన్నెల జెండా చిత్రంతో మార్చుకొన్నారు. ‘హర్ ఘర్ తిరంగా’ ఉద్యమాన్ని ఒక గుర్తుపెట్టుకోదగ్గ ప్రజాఉద్యమంగా మలచడానికి ఇదే పనిని చేయాలంటూ ప్రతి ఒక్కరికి ఆయన విజ్ఞప్తి చేశారు.
తిరంగాతో దిగిన సెల్ఫీని harghartiranga.com లో ప్రతి ఒక్కరు షేర్ చేసుకోవాలని కూడా శ్రీ నరేంద్ర మోదీ కోరారు.
ప్రధాన మంత్రి ‘ఎక్స్’ లో ఒక సందేశంలో:
‘‘ఈ సంవత్సరంలో స్వాతంత్య్ర దినం త్వరలోనే రానుంది; మరోసారి #HarGharTiranga ని ఒక స్మరణీయ సామూహిక ఉద్యమంగా తీర్చిదిద్దుదాం, రండి. నేను నా ప్రొఫైల్ పిక్చరును మార్చుకొంటున్నాను; మరి నాతో పాటు మీరంతా ఇదే పనిని చేసి మన త్రివర్ణ పతాకాన్ని గౌరవించుకొందామని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆఁ అన్నట్లు, మీ సెల్ఫీలను harghartiranga.com లో షేర్ చేయగలరు’’ అని పేర్కొన్నారు.
***
DS/ST
(Release ID: 2043541)
Visitor Counter : 79
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Hindi_MP
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam