ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బాంగ్లాదేశ్ లో కొత్త బాధ్యతలను స్వీకరించిన నోబెల్ బహుమతి గ్రహీత ప్రొఫెసర్ ముహమ్మద్ యూనుస్ కు ప్రధాన మంత్రి అభినందనలు

Posted On: 08 AUG 2024 9:50PM by PIB Hyderabad

బాంగ్లాదేశ్ లో కొత్తగా ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వానికి ముఖ్య సలహాదారు పదవీ బాధ్యతలను నోబెల్ బహుమతి గ్రహీత ప్రొఫెసర్ ముహమ్మద్ యూనుస్ చేపట్టిన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆయనకు అభినందనలను తెలియజేశారు.

 

భారతదేశానికి పొరుగు దేశమైన బాంగ్లాదేశ్ లో ప్రశాంత స్థితి తిరిగి నెలకొనాలని, హిందువులు సహా ఇతర అల్పసంఖ్యక సముదాయాలు సురక్షితంగా ఉండాలన్న ఆకాంక్షను కూడా శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తంచేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ లో పొందుపరచిన ఒక సందేశంలో:

‘‘ప్రొఫెసర్ ముహమ్మద్ యూనుస్ తనకు అప్పగించిన కొత్త బాధ్యతలను చేపట్టిన సందర్భంగా ఆయన కు ఇవే నా శుభాకాంక్షలు. ప్రశాంత స్థితి త్వరగా తిరిగి నెలకొనాలని, తద్ద్వారా హిందువులు మరియు ఇతర అల్పసంఖ్యక సముదాయాల సురక్షకు, సంరక్షణకు పూచీ దక్కాలని మేం ఆశిస్తున్నాం. మన ఇరు దేశాల ప్రజల శాంతియుతమైన, భద్రతసహితమైన, అభివృద్ధి ప్రధానమైన ఉమ్మడి ఆకాంక్షలను నెరవేర్చడం కోసం  బాంగ్లాదేశ్ తో కలసి పనిచేయాలన్న నిబద్ధతను భారతదేశం కొనసాగిస్తుంది.’’

అని పేర్కొన్నారు.

 

 

 

***

DS/RT


(Release ID: 2043533) Visitor Counter : 81