ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పారిస్ ఒలింపిక్స్ లో కాంస్యాన్ని గెలిచినందుకు భారతీయ హాకీ జట్టుకు ప్రధాన మంత్రి అభినందనలు

Posted On: 08 AUG 2024 7:46PM by PIB Hyderabad

ఫ్రాన్స్ లోని పారిస్ లో ప్రస్తుతం జరుగుతున్న ఒలింపిక్స్ లో కాంస్య పతకాన్ని గెలిచిన భారతీయ హాకీ జట్టు కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలను తెలియజేశారు.

 

వారి నైపుణ్యాన్ని, పట్టుదలను, జట్టు స్ఫూర్తిని శ్రీ నరేంద్ర మోదీ పొగడారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ లో పొందుపరచిన ఒక సందేశంలో:

‘‘రాబోయే కొన్ని తరాల పాటు మదిలో పదిలపరచుకొనేటటువంటి అసాధారణ కార్యమిది.

భారతదేశం హాకీ జట్టు ఒలింపిక్స్ లో తళుకులీనింది, కాంస్య పతకాన్ని మాతృభూమికి తీసుకువస్తున్నది. ఇది ఒలింపిక్స్ లో వారు వరుసగా సాధించిన రెండో పతకం కావడం మూలాన ఈ పతకం మరింత విశిష్టమైనటువంటి పతకం అని చెప్పాలి.

వారి నైపుణ్యాన్ని పట్టుదలను, జట్టు స్ఫూర్తిని వరించి వచ్చిన విజయమే ఇది. వారు అమిత ధైర్యాన్ని, కిందపడ్డా తిరిగి లేచే తత్వాన్ని చాటిచెప్పారు. క్రీడాకారులకు ఇవే అభినందనలు.

హాకీ అంటే భారతదేశంలో ప్రతి ఒక్కరికీ ఒక ఉద్వేగభరితమైన బంధం ఉంది. మరి ఈ కార్యసాధన ఈ క్రీడ ను మన దేశ యువతీయువకులలో మరింత ఎక్కువ ఆదరణపాత్రమైందిగా మార్చివేసేస్తుంది.’’ అని పేర్కొన్నారు.

 

 

 

***

DS/RT


(Release ID: 2043529) Visitor Counter : 67