ప్రధాన మంత్రి కార్యాలయం
శాస్త్రీయ నృత్యకారిణి యామిని కృష్ణమూర్తి మృతికి ప్రధానమంత్రి సంతాపం
प्रविष्टि तिथि:
04 AUG 2024 2:14PM by PIB Hyderabad
భారతీయ శాస్త్రీయ నృత్యకారిణి డాక్టర్ యామిని కృష్ణమూర్తి మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆదివారం (2024 ఆగస్టు 4న) సంతాపం తెలిపారు.
భారతీయ వారసత్వాన్ని సంపన్నం చేయడానికి డాక్టర్ యామిని కృష్ణమూర్తి మహనీయమైన తోడ్పాటును అందించారని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
‘‘డాక్టర్ యామిని కృష్ణమూర్తి కన్నుమూత వార్త విని బాధపడ్డాను. ఆమె ప్రావీణ్యం, భారతీయ శాస్త్రీయ నృత్యం పట్ల ఆమె అంకిత భావం కొన్ని తరాల తరబడి ప్రేరణను కలిగించడం తో పాటు మన సాంస్కృతిక రంగస్థలంపై చెరిగిపోనటువంటి ముద్రను వేశాయి. మన వారసత్వాన్ని సంపన్నం చేయడానికి ఆమె మహనీయమైన తోడ్పాటును అందించారు. ఆమె కుటుంబానికి, ఆమె అభిమానులకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఓం శాంతి.’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
DS/RT
(रिलीज़ आईडी: 2041386)
आगंतुक पटल : 107
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Hindi_MP
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam