ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సిఆర్ పిఎఫ్ సిబ్బందికి వారి సంస్థ స్థాపన దినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 27 JUL 2024 10:07AM by PIB Hyderabad

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్ పిఎఫ్) సిబ్బంది అందరికీ వారి సంస్థ స్థాపన దినం సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలను తెలియజేశారు. వారి అచంచల అంకిత భావం, దేశ ప్రజలకు వారు అందిస్తున్న నిరంతర సేవలు నిజంగా ప్రశంసనీయమైనవిగా ఉంటున్నాయని ప్రధాన మంత్రి అన్నారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్’ లో ఈ క్రింది విధంగా పేర్కొన్నారు:

‘‘స్థాపన దినం సందర్భంగా @crpfindia సిఆర్ పిఎఫ్ సిబ్బంది అందరికీ నా శుభాకాంక్షలు. దేశం పట్ల వారికి ఉన్న అచంచల అంకిత భావం, విశ్రాంతి అనేదే ఎరుగక దేశ ప్రజలకు వారు చేస్తున్న సేవలు నిజంగా ప్రశంసనీయమైనవి. ఎట్టి పరిస్థితులలోనైనా సరే, అత్యున్నత ప్రమాణాలకు తులతూగే ధైర్య, సాహసాలకు మరియు నిబద్ధతకు మారుపేరుగా నిలుస్తున్నారు వారు. మన దేశాన్ని సురక్షితంగా ఉంచడంలో వారి భూమిక సర్వోపరిగా ఉన్నది.’’

 

 

***

DS/ST


(रिलीज़ आईडी: 2038111) आगंतुक पटल : 95
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , Marathi , हिन्दी , Hindi_MP , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam