ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారత్‌తో బంధం బలోపేతానికి యు.కె. ప్ర‌ధాని ప్రాధాన్యమివ్వడంపై ప్ర‌ధానమంత్రి అభినందన

Posted On: 24 JUL 2024 9:17PM by PIB Hyderabad

   భార‌త్‌తో స‌మ‌గ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మ‌రింత విస్తృతం, ప‌టిష్టం చేయ‌డంపై యునైటెడ్ కింగ్‌డ‌మ్ కొత్త ప్రధాని గౌర‌వ‌నీయ కీర్‌ స్ట్రామర్ ప్రాధాన్యం ఇవ్వ‌డాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు.

   యునైటెడ్ కింగ్‌డమ్ విదేశాంగ-కామన్వెల్త్-అభివృద్ధి వ్యవహారాల శాఖ మంత్రి గౌరవనీయ డేవిడ్ లామీతో సమావేశం సందర్భంగా శ్రీ మోదీ ఈ మేరకు స్పందించారు.

దీనిపై సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:

‘‘యు.కె. విదేశాంగ శాఖ మంత్రి గౌరవనీయ డేవిడ్ లామీ @DavidLammyతో సమావేశం కావడం  సంతోషంగా ఉంది. రెండు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం, పటిష్టం చేయడంపై ప్రధానమంత్రి కీర్ స్ట్రామర్ @Keir_Starmer ప్రాధాన్యమివ్వడాన్ని ఈ సందర్భంగా  అభినందిస్తున్నాను. ఈ స్నేహబంధాన్ని మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లేందుకు నిబద్ధతతో ఉన్నాం. ఈ నేపథ్యంలో ద్వైపాక్షిక సాంకేతిక భద్రత కార్యక్రమంతోపాటు పరస్పర ప్రయోజనాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టిఎ) త్వరగా ఖరారుకు చొరవ చూపడం హర్షదాయకం’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

***


(Release ID: 2036712) Visitor Counter : 49