ఆర్థిక మంత్రిత్వ శాఖ

పీఎం ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద 1 కోటి పట్టణ పేద, మధ్యతరగతి కుటుంబాల నివాస గృహ అవసరాలను తీర్చడానికి ₹ 10 లక్ష కోట్ల పెట్టుబడి


పారిశ్రామిక కార్మికుల కోసం డార్మిటరీ రకం అద్దె ఇళ్ల సదుపాయాలను పీపీపీ మోడ్ లో అందింస్తాం : శ్రీమతి నిర్మలా సీతారామన్

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో కలిసి నగరాలను అభివృద్ధి కేంద్రాలుగా అభివృద్ధి చేయడానికి కృషిచేస్తుంది

100 పెద్ద నగరాలకు తాగునీటి సరఫరా, పారిశుధ్యం, ఘన వ్యర్థ నిర్వహణ ప్రాజెక్టులు, సేవలు ప్రోత్సహించబడతాయి

ప్రభుత్వం తదుపరి 5 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం 100 వారపు ‘హాట్స్’ అభివృద్ధికి మద్దతు ఇస్తుంది

ఎక్కువ స్టాంప్ డ్యూటీ వసూలు చేస్తున్న రాష్ట్రాలను అన్నింటికీ సరియైన స్టాంప్ డ్యూటీ రేట్లు విధించడానికి ప్రోత్సహించబడతాయి

ఆర్థిక మంత్రిత్వ శాఖ

Posted On: 23 JUL 2024 12:44PM by PIB Hyderabad

కేంద్ర ఆర్థిక మంత్రి, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి, శ్రీమతి నిర్మలా సీతారామన్  2024-25 కేంద్ర బడ్జెట్ ప్రసంగిస్తూ, "ప్రజలు మా ప్రభుత్వానికి దేశాన్ని సుదృఢమైన సమగ్ర  అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లడానికి మంచి అవకాశాన్ని ఇచ్చారు" అన్నారు.

పీఎం ఆవాస్ యోజన

పీఎం ఆవాస్ యోజన గురించి  కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశంలోని గ్రామీణ, నగర ప్రాంతాలలో మూడు కోట్ల అదనపు ఇళ్లు ప్రకటించబడ్డాయని, వీటికి బడ్జెట్ లో అవసరమైన కేటాయింపులు చేయబడుతున్నాయని తెలిపారు.  పీఎం ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద, 1 కోటి పట్టణ పేద, మధ్యతరగతి కుటుంబాల నివాస అవసరాలను తీర్చడం కోసం  ₹ 10 లక్ష కోట్ల పెట్టుబడిని ప్రకటించారు. ఇందులో ₹ 2.2 లక్ష కోట్ల కేంద్ర సహాయం మూడు సంవత్సరాలలో అందించబడుతుంది. అంతేకాకుండా, సరియైన రేట్లలో రుణాలు అందించడానికి వడ్డీ రాయితీ కూడా ప్రతిపాదించబడింది.

అద్దె ఇళ్లు

అద్దె ఇళ్ల గురించి మాట్లాడుతూ, కేంద్ర మంత్రి , "పారిశ్రామిక కార్మికుల కోసం పీపీపీ మోడ్ లో విజిఎఫ్, అనుబంధ పరిశ్రమల నుండి మద్దతుతో డార్మిటరీ రకం అద్దె ఇళ్ల సదుపాయాలను ఏర్పాటు చేయడానికి కట్టుబడి ఉంటుంది" అని చెప్పారు."  అద్దె ఇళ్ల మార్కెట్లలో అధిక లభ్యతను కల్పించడానికి సమర్థవంతమైన, స్పష్టమైన, అనుకూల విధానాలు, నియమాలు రూపొందించబడతాయి.

నగరాలు అభివృద్ధి కేంద్రాలుగా

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో కలిసి నగరాలను అభివృద్ధి కేంద్రాలుగా అభివృద్ధి చేయడానికి పనిచేస్తుంది. "ఇది ఆర్థిక మరియు రవాణా ప్రణాళిక, నగర చివారు ప్రాంతాల అభివృద్ధిని టౌన్ ప్లానింగ్ స్కీముల ద్వారా సాధిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు.

కేంద్ర ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో మాట్లాడుతూ, ప్రస్తుత నగరాలను పరివర్తన కోసం సృజనాత్మక బ్రౌన్‌ఫీల్డ్ పునరాభివృద్ధి కోసం, ప్రభుత్వం విధానాలు, మార్కెట్ ఆధారిత యంత్రాంగాలు, నియంత్రణ కోసం ఒక ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందిస్తుంది.నగరాల అభివృద్ధి కోసం ప్రభుత్వం మార్కెట్-ఆధారిత పద్ధతులు ,అనుకూల విధానాలు,  నియమాల కోసం ఒక ఫ్రేమ్‌వర్క్ రూపొందించబడుతుంది.మూడు సంవత్సరాలలో 14 పెద్ద నగరాలకు రవాణా ఆధారిత అభివృద్ధి ప్రణాళిక, అమలు వ్యూహం ప్రకటించబడింది.

తాగునీటి సరఫరా, పారిశుధ్యం

తాగునీటి సరఫరా, పారిశుధ్యం గురించి కేంద్ర ఆర్థిక మంత్రి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు, బహుముఖ అభివృద్ధి బ్యాంకులతో కలిసి 100 పెద్ద నగరాలకు తాగునీటి సరఫరా, పారిశుధ్యం, ఘన వ్యర్థ నిర్వహణ ప్రాజెక్టులు, సేవలు ప్రోత్సహించబడతాయి. ఆమె ఇంకా చెప్పినట్లు, ఈ ప్రాజెక్టులు శుద్ది చేయబడిన నీటిని సాగునీటికి మరియు సమీప ప్రాంతాలలోని ట్యాంకులను నింపడానికి ఉపయోగించబడతాయి.

వారపు ‘హాట్స్’

 ప్రధానమంత్రి స్వనిధి పథకం విజయవంతం కావడం తో దాని స్ఫూర్తి తో వీధి వ్యాపారుల జీవితాల్లో మార్పు తీసుకురావడంలో  ఎంపిక చేసిన నగరాల్లో 100 వారపు 'హాట్స్' లేదా వీధి ఆహార హబ్‌ల అభివృద్ధికి ప్రభుత్వం  తదుపరి ఐదు సంవత్సరాలకాలంలో ప్రతి సంవత్సరం ఒక పథకాన్ని రూపొందిస్తుందని శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

స్టాంప్ డ్యూటీ

స్టాంప్ డ్యూటీ

శ్రీమతి నిర్మలా సీతారామన్ కేంద్ర ప్రభుత్వం అధిక  స్టాంప్ డ్యూటీని విధించే రాష్ట్రాలను రేట్లను తగ్గించే విధంగా ప్రోత్సహిహిస్తుందని, అలాగే మహిళలు కొనుగోలు చేసే ఆస్తులపై సుంకాన్ని మరింత తగ్గించడాన్ని కూడా పరిశీలిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రిశ్రీమతి నిర్మలా సీతారామన్ తెలిపారు.

***



(Release ID: 2036023) Visitor Counter : 26