ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి ప్యాకేజీ కింద 5వ ప్రణాళికగా అగ్రశ్రేణి కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ అవకాశాలను అందించే పథకం ప్రారంభం


ఐదేళ్లలో 500 అగ్రశ్రేణి కంపెనీల్లో కోటి మంది యువతకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు

ఇంటర్న్‌షిప్ అలవెన్స్ నెలకు రూ '5,000'తో పాటు రూ '6,000' సహాయం ఒక్కసారి అందించబడుతుంది.

प्रविष्टि तिथि: 23 JUL 2024 1:04PM by PIB Hyderabad

అగ్రశ్రేణి కంపెనీల్లో ఇంటర్న్ షిప్ అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం సమగ్ర పథకాన్ని ప్రారంభించనుంది. ప్రధానమంత్రి ప్యాకేజీ కింద ఇది 5వ ప్రణాళిక.

ఈరోజు పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్ 2024-25ను ప్రవేశపెడుతూ, ఈ పథకం ద్వారా 5 సంవత్సరాల్లో 1 కోటి మంది యువతకు 500 అగ్రశ్రేణి కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీని వల్ల 12 నెలల పాటు నిజజీవిత వ్యాపార వాతావరణం, వివిధ వృత్తులు, ఉపాధి అవకాశాలపై అవగాహన లభిస్తుందని చెప్పారు.

ఈ పథకంలో యువతకు నెలకు రూ.5,000 ఇంటర్న్‌షిప్ అలవెన్స్, రూ.6,000 సహాయం  ఒక్కసారి ఇస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు. శిక్షణ వ్యయం, ఇంటర్న్‌షిప్  ఖర్చులో 10 శాతాన్ని కంపెనీలు తమ సీఎస్ఆర్ నిధుల నుంచి భరిస్తాయని ఆర్థిక మంత్రి తెలిపారు.  

 

***


(रिलीज़ आईडी: 2035813) आगंतुक पटल : 264
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Hindi_MP , Marathi , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam