పార్లమెంటరీ వ్యవహారాలు
azadi ka amrit mahotsav

జూలై 21న అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం

Posted On: 16 JUL 2024 3:53PM by PIB Hyderabad

పార్లమెంటు బడ్జెటు సమావేశాల కంటే ముందుగా పార్లమెంటు ఉభయ సభలలోని రాజకీయ పక్షాల నేతలతో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ కిరెన్ రిజిజు ఒక సమావేశం కానున్నారు.  ఈ అఖిల పక్ష సమావేశాన్ని న్యూ ఢిల్లీ లోని పార్లమెంట్ భవనాన్ని ఆనుకొని ఉన్న మెయిన్ కమిటీ రూములో 2024 జూలై 21న ఉదయం పూట 11 గంటలకు నిర్వహించనున్నారు.

 

పార్లమెంటు బడ్జెటు సమావేశాలు 2024 జూలై 22న ప్రారంభం కానున్నాయిప్రభుత్వ కార్యకలాపాలలో ఏవైనా అనివార్య అవసరాలు ఎదురైతే గనక వాటిని లెక్కలోకి తీసుకొంటారు;  ఈ సమావేశాలు 2024 ఆగస్టు 12న ముగిసే అవకాశం ఉంది.

 

 

***


(Release ID: 2033774) Visitor Counter : 83