ప్రధాన మంత్రి కార్యాలయం
విడిఎన్‌కెహెచ్ లోని రోసాటమ్ మండపాన్ని సందర్శించిన ప్రధాన మంత్రి
Posted On:
09 JUL 2024 4:18PM by PIB Hyderabad
రష్యా అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ తన వెంట రాగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున మాస్కో లోని విడిఎన్‌కెహెచ్ లో అఖిల రష్యా ప్రదర్శన కేంద్రాన్ని సందర్శించారు.
నేతలు ఇద్దరూ విడిఎన్‌కెహెచ్ లోని రోసాటమ్ మండపంలో కలియదిరిగారు. రోసాటమ్ మండపాన్ని 2023 నవంబరు లో ప్రారంభించడమైంది. ఇది విజ్ఞానశాస్త్ర పరమైన, సాంకేతిక విజ్ఞాన పరమైన అభివృద్ధి సూచికలతో ఏర్పాటు చేసిన అతి పెద్ద ప్రదర్శన మండపాలలో ఒకటి. పరమాణు శక్తిని పౌర ప్రయోజనాలకు వినియోగించుకొనే రంగంలో భారతదేశం-రష్యా సహకారాన్ని ప్రత్యేకంగా వివరించే ఛాయాచిత్రాల ప్రదర్శనను ప్రధాన మంత్రి చూశారు. భారతదేశంలో కూడంకుళం పరమాణు విద్యుత్తు కేంద్రాని (కెకెఎన్ పిపి)కి గుండెకాయగా ఉన్న వివిఇఆర్-1000 తాలూకు శాశ్వత కార్యాచరణ ప్రధాన నమూనా అయిన ‘‘అటామిక్ సింఫనీ’’ని కూడా ప్రధాన మంత్రి తిలకించారు.
భారతదేశాని కి, రష్యా కు చెందిన విద్యార్థుల బృందంతో మండపం వద్ద ప్రధాన మంత్రి మాట్లాడారు. విజ్ఞానశాస్త్రం- సాంకేతికవిజ్ఞాన రంగంలో భావి తరాల మేలు కోసం, భూగ్రహం మేలు కోసం ఇంకా ఏయే అవకాశాలను వినియోగించుకోవచ్చో పరిశీలించవలసిందంటూ విద్యార్థులను ప్రధాన మంత్రి ప్రోత్సహించారు.
***
(Release ID: 2031895)
Visitor Counter : 72
Read this release in:
Odia
,
English
,
Marathi
,
Gujarati
,
Malayalam
,
Urdu
,
Hindi
,
Hindi_MP
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Kannada