నీతి ఆయోగ్

‘సంపూర్ణతా అభియాన్’ను ప్రారంభించనున్న నీతి ఆయోగ్


2024 జూలై 4 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రచారం.. ఏడీపీ/ఏబీపీ జిల్లాలు, బ్లాక్‌లలో గుర్తించిన 6 సూచికల్లో సంతృప్తతను సాధించాడమే లక్ష్యం

Posted On: 03 JUL 2024 4:37PM by PIB Hyderabad


నీతి ఆయోగ్ 3 నెలల పాటు ‘సంపూర్ణతా అభియాన్’ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. 2024 జూలై 4 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రచారం కొనసాగనుంది.  దేశ వ్యాప్తంగా ఆకాంక్ష జిల్లాల్లో 6 సూచికలు, ఆకాంక్ష బ్లాకుల్లో 6 కీలక సూచికల సంతృప్తతను సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది.  ఈ ‘సంపూర్ణతా అభియాన్’ ఆకాంక్ష జిల్లా కార్యక్రమం. ఈ కార్యక్రమం కింద 112 ఆకాంక్ష జిల్లాలు, 500 ఆకాంక్ష బ్లాక్ లలో గుర్తించిన 6 సూచికలలో ప్రతిదానిలో సంతృప్తతను సాధిండమే లక్ష్యం.

ఈ ‘సంపూర్ణతా అభియాన్’ అన్ని ఆకాంక్ష బ్లాక్ లలో ఈ క్రింది 6 గుర్తించబడిన కేపీఐలపై దృష్టి పెట్టనుంది.

1. ఆరోగ్య సంరక్షణ కోసం మొదటి త్రైమాసికంలో నమోదు చేసుకున్న గర్భిణీ స్త్రీల శాతం.
2. బ్లాక్‌లోని లక్ష్యిత జనాభాతో పోలిస్తే మధుమేహం కోసం పరీక్షించిన వ్యక్తుల శాతం.
3. లక్ష్యిత జనాభాతో పోలిస్తే బ్లాక్‌లో రక్తపోటు కోసం పరీక్షించిన వ్యక్తుల శాతం.
4. ఐసీడీఎస్ ప్రోగ్రామ్ కింద పౌష్టికాహార సప్లిమెంట్లను క్రమం తప్పకుండా తీసుకుంటున్న గర్భిణీ స్త్రీల శాతం.
5. మట్టి నమూనా సేకరణతో పోలిస్తే సాయిల్ హెల్త్ కార్డ్‌ల జారీ శాతం.
6. బ్లాక్ లోని మొత్తం స్వయం సహాయక సంఘాల సంఖ్యతో పోలిస్తే రివాల్వింగ్ ఫండ్ అందుకున్న స్వయం సహాయక సంఘాల శాతం.

'సంపూర్ణతా అభియాన్' కింద ఆకాంక్ష జిల్లాల్లో గుర్తించిన 6 కేపీఐలు ఈ విధంగా ఉన్నాయి.

1. మొదటి త్రైమాసికంలో ఆరోగ్య సంరక్షణ కోసం నమోదు చేసుకున్న గర్భిణీ స్త్రీల శాతం.
2. ఐసీడీఎస్ ప్రోగ్రామ్ కింద క్రమం తప్పకుండా పౌష్టికాహార సప్లిమెంట్లను తీసుకుంటున్న గర్భిణీ స్త్రీల శాతం.
3. పూర్తిగా రోగనిరోధక శక్తి పొందిన పిల్లల శాతం (9-11 నెలలు) (బీసీజీ+డీపీటీ3+ఓపీవీ3+తట్టు 1)
4. పంపిణీ చేసిన సాయిల్ హెల్త్ కార్డుల సంఖ్య.
5. మాధ్యమిక స్థాయిలో ప్రస్తుతం విద్యుత్ సౌకర్యం ఉన్న పాఠశాలల శాతం.
6. విద్యాసంవత్సరం ప్రారంభమైన 1 నెలలోపు పిల్లలకు పాఠ్యపుస్తకాలు అందించే పాఠశాలల శాతం.

'సంపూర్ణతా అభియాన్' ప్రారంభోత్సవంలో భాగంగా జిల్లాలు, బ్లాకులు నిర్వహించగల కార్యక్రమాల జాబితాను నీతి ఆయోగ్ అందిస్తోంది. అలాగే ప్రచారం ఉధృతిని కొనసాగించడానికి క్రమం తప్పకుండా అవగాహన కార్యకలాపాలను నిర్వహించడానికి బ్లాక్ లు, జిల్లాలను ప్రోత్సహిస్తున్నారు.

ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేయడానికి, క్షేత్రస్థాయిలో స్పష్టమైన ప్రభావాన్ని చూపడానికి..

1. జిల్లాలు/బ్లాకులు ఆరు సూచికలను సంతృప్తం చేయడానికి 3 నెలల కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తాయి.
2 జిల్లాలు/బ్లాకులు ప్రతి నెలా సంతృప్తతపై పురోగతిని సమీక్షిస్తాయి.
3. అవగాహన, ప్రవర్తన మార్పు ప్రచారాలను అమలు చేయడం.
4. జిల్లా అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలతో ఏకకాలంలో పర్యవేక్షించడం

ఈ జిల్లాలు, బ్లాక్‌ల సమర్థవంతమైన, వేగవంతమైన అభివృద్ధిని నిర్ధారించడానికి నీతి ఆయోగ్ సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలతో పాటు రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలతో కలిసి పని చేస్తుంది. ఈ సహకారం మెరుగైన ప్రణాళిక, అమలు, సామర్థ్యాన్ని పెంపొందించడం, మెరుగైన, స్థిరమైన సేవలను అందించడంపై
దృష్టి పెడుతుంది.

ఆకాంక్ష జిల్లాలు, బ్లాకుల కార్యక్రమం గురించి..

దేశంలోని సాపేక్షంగా వెనుకబడిన, మారుమూల ప్రాంతాల వేగవంతమైన అభివృద్ధిని నిర్ధారించడానికి 2018 సంవత్సరంలో 112 జిల్లాలో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ (ఏడీపీ)ను ప్రారంభించారు. ప్రజల జీవితాలను సంబంధించి కీలక సూచికలను మెరుగుపరచడంలో ఏపీడీ స్పష్టమైన ప్రభావాన్ని చూపింది. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్స్ ప్రోగ్రామ్ (ఏడీపీ) యొక్క విజయం ఆధారంగా, గౌరవనీయ ప్రధాన మంత్రి 2023 లో ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ (ఏబీపీ) ను ప్రారంభించారు. ఆరోగ్యం, పోషకాహారం, విద్య, తాగునీరు, పారిశుధ్యం, వ్యవసాయం, నీటి వనరులు, ఆర్థిక సమ్మిళితం, మౌలిక సదుపాయాలు వంటి వివిధ రంగాలలో దేశవ్యాప్తంగా 500 బ్లాక్ లలో అవసరమైన ప్రభుత్వ సేవలను సంతృప్తీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

 

ఆకాంక్ష జిల్లా కార్యక్రమం

ఆకాంక్ష బ్లాక్ కార్యక్రమం

2018 జనవరిలో ప్రధానమంత్రి ప్రారంభించారు.

2023 జనవరిలో ప్రధానమంత్రి ప్రారంభించారు.

దేశవ్యాప్తంగా 112 జిల్లాలను త్వరితగతిన, సమర్థవంతంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది.

దేశవ్యాప్తంగా 500 బ్లాకుల్లో (329 జిల్లాలు) అవసరమైన ప్రభుత్వ సేవలను సంతృప్తం చేయాడమే లక్ష్యం.

ఐదు అంశాలపై దృష్టి కేంద్రీకరించబడింది

- ఆరోగ్యం, పోషకాహారం
- చదువు
- వ్యవసాయం, నీటి వనరులు
- ఆర్థిక సమ్మిళితం, నైపుణ్య అభివృద్ధి
- మౌలిక సదుపాయాలు

 

Focuses on five themes:

  • Health & Nutrition
  • Education
  • Agriculture and Allied Services
  • Basic Infrastructure
  • Social Development

81 అభివృద్ధి సూచికలపై పురోగతిని నిర్ణయిస్తారు.

అభివృద్ధి యొక్క 40 సూచికల ఆధారంగా పురోగతిని నిర్ణయిస్తారు.

బ్లాక్ ప్రొఫైల్ ను ఇక్కడ నుండి యాక్సెస్ చేయవచ్చు.



****
 



(Release ID: 2030769) Visitor Counter : 153