ప్రధాన మంత్రి కార్యాలయం

మాజీ ఉప-రాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్య నాయుడు జీవన ప్రస్థానంపై జూన్ 30న మూడు పుస్తకాలను ఆవిష్కరించనున్న ప్రధానమంత్రి

Posted On: 29 JUN 2024 11:03AM by PIB Hyderabad

   మాజీ ఉప-రాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్య నాయుడు 75వ జన్మదినోత్సవం నేపథ్యంలో ఆయన జీవన ప్రస్థానంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జూన్ 30న మధ్యాహ్నం 12:00 గంటలకు మూడు పుస్తకాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించనున్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోగల  అన్వయ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.

ప్రధానమంత్రి ఆవిష్కరించే పుస్తకాల జాబితాలో:

  1. ‘‘వెంకయ్య నాయుడు – లైఫ్ ఇన్ సర్వీస్’’ పేరిట ‘ది హిందూ‘, హైదరాబాద్ శాఖ మాజీ రెసిడెంట్ ఎడిటర్ శ్రీ ఎస్.నగేష్ కుమార్ రచించిన మాజీ ఉపరాష్ట్రపతి జీవిత చరిత్ర
  2.  ‘‘సెలెబ్రేటింగ్ భారత్ – ది మిషన్ అండ్ మెసేజ్ ఆఫ్ శ్రీ ఎం.వెంకయ్య నాయుడు యాజ్ 13 వైస్-ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’’ పేరిట ఆయన మాజీ కార్యదర్శి డాక్టర్ ఐ.వి.సుబ్బారావు సంకలనం చేసిన చిత్రమాలిక
  3. ‘‘మహానేత – శ్రీ ఎం.వెంకయ్యనాయుడు జీవితం... ప్రస్థానం’’ పేరిట శ్రీ సంజయ్ కిషోర్ తెలుగులో రూపొందించిన సచిత్ర జీవిత చరిత్ర పుస్తకం ఉన్నాయి.


(Release ID: 2029496) Visitor Counter : 74