ప్రధాన మంత్రి కార్యాలయం

ఐరోపా మండలి అధ్యక్షుడిగా ఎన్నికైన గౌరవనీయ ఆంటోనియో కోస్టాకు ప్రధానమంత్రి అభినందనలు

Posted On: 28 JUN 2024 8:25PM by PIB Hyderabad

   ఐరోపా మండలి తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికైన గౌరవనీయ ఆంటోనీయో కోస్టాకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం 'ఎక్స్' ద్వారా పంపిన సందేశంలో:

   "ఐరోపా మండలి తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికైన నా మిత్రుడు గౌరవనీయ ఆంటోనియో కోస్టాకు @antoniolscosta నా హృదయపూర్వక అభినందనలు. ఈ నేపథ్యంలో భారత-ఐరోపా సమాఖ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసే దిశగా మీతో కలిసి కృషి చేసేందుకు నేను సదా సిద్ధంగా ఉంటాను " అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.



(Release ID: 2029468) Visitor Counter : 13