ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

యోగా ఒక ఏకీకృత శక్తిగా మారి భిన్న సంస్కృతి సంప్రదాయ నేపథ్యాలున్న ప్రజలను ఒక్కతాటిపైకి తెస్తోంది: ప్రధానమంత్రి

Posted On: 21 JUN 2024 9:15PM by PIB Hyderabad

   దో అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐవైడి) నాడు ప్రపంచవ్యాప్తంగా అపూర్వ స్థాయిలో యోగా సాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కొనియాడారు. వ్యక్తిగతంగానే కాకుండా వివిధ సంఘాలు, సంస్థలు సమష్టిగా యోగాభ్యాస కార్యక్రమం నిర్వహించడాన్ని ఆయన ప్రశంసించారు. యోగా విస్తృత వ్యాప్తికి తమవంతు పాత్ర పోషిస్తున్నారంటూ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:

‘‘ప్రపంచవ్యాప్తంగా 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం అపూర్వ స్థాయిలో నిర్వహించబడింది. వ్యక్తులు, సంఘాలు, సంస్థలు యోగా సాధనలో చేసిన సమష్టి కృషికి ధన్యవాదాలు. తద్వారా భిన్న సంస్కృతి.. సంప్రదాయాలకు అతీతంగా ప్రజలను ఒక్కతాటిపైకి తేవడంలో యోగా ఒక ఏకీకృత శక్తిగా మారిందన్న వాస్తవం రుజువైంది. ముఖ్యంగా యువతరం ఎనలేని ఉత్సాహం, అంకితభావంతో యోగాభ్యాసంలో పాల్గొనడం ఎంతో సంతోషం కలిగించింది.

   యోగాకు విశేష ప్రాచుర్యం కల్పనలో తమవంతు కృషి చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఐక్యత, సామరస్యాలను ప్రోది చేయడంలో ఈ సమష్టి కృషి ఎంతగానో తోడ్పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా యోగా శిక్షకుల సంఖ్య పెరగడమేగాక తమ అంకితభావం, నైపుణ్యంతో యోగా దిశగా ప్రతి ఒక్కరికీ వారు స్ఫూర్తినివ్వడం నాకెంతో సంతోషంగా ఉంది. భవిష్యత్తులో యావత్ ప్రపంచాన్నీ యోగా ఏకీకృతం చేస్తుంది’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

***


(Release ID: 2028331) Visitor Counter : 73