ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధాన మంత్రి కిటెలిఫోన్ ద్వారా అభినందనలను తెలిపిన కతర్ యొక్క అమీరు
భారతదేశం యొక్క ప్రజల పట్ల ఆయన అందించిన శుభాకాంక్షలకు మరియు వ్యక్తం చేసిన సకారాత్మకమైన భావాల కు ధన్యవాదాలను పలికిన ప్రధాన మంత్రి
భారతదేశం-కతర్ సంబంధాల ను మరింత బలపరచుకోవాలన్న తమ వచనబద్ధత ను ఇద్దరు నేతలు పునరుద్ఘాటించారు
2024 ఫిబ్రవరి లో కతర్ను తాను సందర్శించడాన్ని గుర్తు కు తెచ్చుకొన్న ప్రధాన మంత్రి; అంతేకాకుండా, భారతదేశాన్ని సందర్శించవలసింది గా కతర్ యొక్క అమీరు కు మరోమారు ఆహ్వానంపలికారు
అమీరు గారి కి పుట్టిన రోజు శుభాకాంక్షల తో పాటు ఈద్ శుభాకాంక్షల ను కూడా తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
10 JUN 2024 9:24PM by PIB Hyderabad
కతర్ యొక్క అమీరు శ్రీ శేఖ్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి ఈ రోజు న టెలిఫోన్ మాధ్యం ద్వారా అభినందనల ను తెలిపారు.
భారతదేశం యొక్క ప్రజల పట్ల అమీరు గారు వ్యక్తం చేసిన హృదయ పూర్వకమైన శుభాకాంక్షల కు మరియు సకారాత్మకమైన భావాల కు గాను ప్రధాన మంత్రి ధన్యవాదాల ను పలికారు.
భారతదేశాని కి మరియు కతర్ కు మధ్య మైత్రి పూర్వకమైనటువంటి మరియు బహుముఖీనమైనటువంటి సంబంధాల ను మరింత బలపరచుకోవడం కోసం ఉభయ నేత లు వారి వచన బద్ధత ను పునరుద్ఘాటించారు.
2024 ఫిబ్రవరి లో కతర్ ను తాను సందర్శించడం ఫలప్రదం కావడాన్ని ప్రధాన మంత్రి జ్ఞప్తి కి తెచ్చుకొన్నారు; వీలైనంత త్వరలో భారతదేశాన్ని సందర్శించ వలసిందంటూ కతర్ యొక్క అమీరు ను తాను ఆహ్వానించిన సంగతి ని ప్రధాన మంత్రి గుర్తు చేశారు.
అమీరు గారి కి జన్మదిన శుభాకాంక్షల ను ప్రధాన మంత్రి తెలియజేశారు. త్వరలో రానున్న ఈద్-ఉల్-అజ్ హా పండుగ రోజు ను పురస్కరించుకొని అభినందనల ను కూడా ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.
***
(Release ID: 2026210)
Visitor Counter : 44
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam