ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి అభినందనలనుతెలిపిన బాంగ్లాదేశ్ ప్రధాని శేఖ్ హసీనా  గారు


గడచిన పదేళ్ళ లో ద్వైపాక్షిక సంబంధాల లో నమోదైనప్రముఖ కార్యసాధనను  వారు గుర్తించారు

ఈ భాగస్వామ్యాన్ని మరింత గా బలపరచాలని ఇద్దరు నేతలు ఆశిస్తున్నారు

Posted On: 05 JUN 2024 10:13PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ బాంగ్లాదేశ్ యొక్క ప్రధాని శేఖ్ హసీనా గారు టెలిఫోన్ ద్వారా మాట్లాడుతూ, లోక్ సభ యొక్క పద్ధెనిమిదో ఎన్నికల లో ఎన్‌డిఎ విజయం సాధించినందుకు అభినందనల ను తెలియ జేశారు.

 

ప్రధాన మంత్రి కి ముందుగా అభినందనలను తెలియ జేసిన విదేశీ నేతల లో ప్రధాని శేఖ్ హసీనా గారు మొట్టమొదటి నేత; ఇది ఇద్దరు నేతల మధ్య గల సౌహార్దత కు మరియు వ్యక్తిగత సద్భావన కు అద్దం పడుతున్నది.

 

సరిక్రొత్త ప్రజాతీర్పు వెలువడిన నేపథ్యం లో వికసిత్ భారత్ 2047’ మరియు స్మార్ట్ బాంగ్లాదేశ్ 2041’ లకు సంబంధించిన దార్శనికత లో భాగం గా చారిత్రిక సంబంధాలను మరియు సన్నిహిత సంబంధాలను విస్తృత పరచుకోవడం కోసం కలిసికట్టుగా కృషి చేయడాన్ని కొనసాగించుదాం అంటూ ఉభయ నేతలు ప్రతిన పూనారు.

 

గడచిన దశాబ్దం లో రెండు దేశాల కు చెందిన ప్రజల యొక్క జీవనాల లో ప్రముఖమైన మెరుగుదల లు నమోదు అయ్యాయన్న సంగతి ని వారు గుర్తించారు; ఆర్థిక ప్రధానమైన భాగస్వామ్యం మరియు అభివృద్ధి ప్రధానమైన భాగస్వామ్యం, శక్తి రంగ సురక్ష, డిజిటల్ లింకేజిలు మరియు ఇరు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలు, కనెక్టివిటీ లతో పాటు ఇతర రంగాలు సహా అన్ని రంగాల లో పరివర్తనాత్మకమైన సంబంధాల ను పెంపొందింప చేసుకోవాలని తాము ఆశ పడుతున్నట్లు పేర్కొన్నారు.

 

***



(Release ID: 2024465) Visitor Counter : 32