ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి అభినందనల నుతెలిపిన భూటాన్ ప్రధాని
ప్రధాన మంత్రి యొక్క దార్శనిక నాయకత్వాన్ని ప్రశంసించిన ప్రధాని శ్రీ శెరింగ్ తోబ్‌గే
భూటాన్ తో భారతదేశం యొక్క విశిష్ట భాగస్వామ్యాని కి దృఢంగా కట్టుబడి ఉంది అని పునరుద్ఘాటించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
Posted On:
05 JUN 2024 10:15PM by PIB Hyderabad
భూటాన్ యొక్క ప్రధాని శ్రీ దాశో శెరింగ్ తోబ్‌గే ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఈ రోజు న ఫోన్ ద్వారా తో మాట్లాడుతూ, 18వ లోక్ సభ ఎన్నికల లో నేశనల్ డెమక్రటిక్ అలయన్స్ విజయం సాధించినందుకు ఆయన కు అభినందనల ను తెలియజేశారు. గడచిన దశాబ్దం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యొక్క దూరదర్శి నాయకత్వాన్ని ప్రధాని శ్రీ తోబ్‌గే ప్రశంసించడం తో పాటు శ్రీ నరేంద్ర మోదీ యొక్క మూడో పదవీ కాలం సఫలం కావాలంటూ తన స్నేహపూర్ణమైన శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.
ప్రధాని శ్రీ తోబ్‌గే కు ఆయన వ్యక్తం చేసిన అభినందనల కు గాను ధన్యవాదాల ను ప్రధాన మంత్రి తెలియజేశారు. భూటాన్ తో భారతదేశాని కి ఉన్న విశిష్ట భాగస్వామ్యానికి అత్యున్నత ప్రాధాన్యాన్ని భారతదేశం కట్టబెడుతోంది అని ప్రధాన మంత్రి వెల్లడించారు. భూటాన్ కు మరియు భారత్ కు మధ్య ఉన్నటువంటి ప్రత్యేకమైన మైత్రి ని మరియు సహకారయుక్త సౌహార్దభరిత సంబంధాల ను మరింత బలపరచడం కోసం భారత ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత ను గురించి ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు.
భారతదేశం-భూటాన్ భాగస్వామ్యం యొక్క విశేషం ఏమిటి అంటే అది అన్ని రంగాల లోను అత్యంత విశ్వాసం, సద్భావన మరియు పరస్పర అవగాహన లతో కూడుకొని ఉంది అనేదే; అంతేకాకుండా ఉభయ దేశాల ప్రజల మధ్య పటిష్టమైనటువంటి పరస్పర సంబంధాలు మరియు ఘనిష్ఠమైనటువంటి ఆర్థిక భాగస్వామ్యం, ఇంకా అభివృద్ధి ప్రధానమైన భాగస్వామ్యం లతో ఇది సుదృఢమవుతుండడం కూడాను చెప్పుకోదగ్గదిగా ఉంది.
***
(Release ID: 2023208)
Visitor Counter : 73
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam