భారత ఎన్నికల సంఘం

2024 సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి దేశవ్యాప్తంగా అర్హులైన ఓటర్లకు హోమ్ ఓటింగ్ సౌకర్యం


వృద్ధులు, దివ్యాంగులు, థర్డ్ జెండర్, పీవీటీజీ ఓటర్లకు హోమ్ ఓటింగ్ సౌకర్యం కల్పనకు ఇ సి ఐ కృషి

దివ్యాంగ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు దోహదపడిన ఇ సి ఐ సాక్షం యాప్

ఓటింగ్ ప్రక్రియలో ప్రాప్యత , సమ్మిళిత చర్యలతో ఆత్మవిశ్వాసంతో ఓటు వేసిన బలహీన వర్గాలు

Posted On: 29 MAY 2024 2:43PM by PIB Hyderabad

2024 సార్వత్రిక ఎన్నికల్లో భౌతిక, ఇతర అవరోధాల కారణంగా అర్హులైన ఓటరు ఓటు హక్కును కోల్పోకుండా చూసేందుకు భారత ఎన్నికల సంఘం భారీ పురోగతి సాధించింది. ఇప్పటివరకు ఆరు దశల ఎన్నికలు ముగిశాక దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, ట్రాన్స్జెండర్లు, పీవీటీజీలు వంటి వివిధ వర్గాల ఓటర్లలో విపరీతమైన ఉత్సాహం కనిపించింది. 85 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు, 40 శాతం బెంచ్ మార్క్ వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయాన్ని 2024 సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా ప్యాన్ ఇండియా ప్రాతిపదికన విస్తరించారు.

 

  

తిరువూరు నియోజకవర్గంలో లంబాడా తెగ, గ్రేట్ నికోబార్ కు చెందిన షోంపెన్ తెగ, అరుణాచల్ ప్రదేశ్ లో నిషి తెగ తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు శ్రీ జ్ఞానేష్ కుమార్డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సంధు లతో కూడిన ఎన్నికల కమిషన్ నేతృత్వంలో దేశవ్యాప్తంగా సమిష్టి ప్రయత్నాలు లోక్ సభ ఎన్నికలు - 2024 - ఆరవ దశ వరకు ఎన్నికలు పూర్తయిన రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల నుండి అనేక విజయగాథలను చూశాయి. సి సి రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. “ప్రపంచవ్యాప్తంగా కొత్త ప్రమాణాలను నెలకొల్పే ఎన్నికల ప్రక్రియల్లో నిరంతర మెరుగుదలకు కృషి చేయాలన్నది కమిషన్ ప్రగాఢ సంకల్పం. దేశానికి గర్వకారణమైన బహుళత్వం, భిన్నత్వ స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఎన్నికల నిర్వహణ ను తీర్చిదిద్దాలని సి కృతనిశ్చయంతో ఉంది. మొత్తం ఎన్నికల ప్రక్రియ అంతటా సమ్మిళితత్వం , ప్రాప్యత సూత్రాలుపద్ధతులను చేర్చడానికి , లోతుగా ఏకీకృతం చేయడానికి ఇసిఐ అంకితం అయింది. పఇది ప్రతిచోటా పునరావృతం చేయడానికి సమాజం ముందు ఒక ఉదాహరణగా నిలుస్తుందిఅన్నారు.

అరుణాచల్ ప్రదేశ్ లో ఓటు వేసేందుకు వెళ్తున్న సీనియర్ సిటిజన్ ఓటరు.

ఓటర్ల జాబితాలో అర్హుల నమోదు, నవీకరణకు రెండేళ్ల క్రితమే సన్నాహాలు ప్రారంభమయ్యాయి. కేటగిరీల ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ప్రత్యేక నమోదు డ్రైవ్ లు, శిబిరాలు నిర్వహించడం ద్వారా ఇది సాధ్యమైంది. ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉన్న వర్గాల మధ్య భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి సి బహుముఖ వ్యూహాన్ని అవలంబించింది.

ఆప్షనల్ హోమ్ ఓటింగ్ సదుపాయం: భారత సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా అద్భుతమైన స్పందన

ఐచ్ఛిక హోమ్ ఓటింగ్ సదుపాయం ఎన్నికల ప్రక్రియలో ఒక సమూల మార్పును సూచిస్తుంది. భారతదేశ సార్వత్రిక ఎన్నికల చరిత్రలో మొదటిసారిగా అందుబాటులోకి వచ్చింది. 85 ఏళ్లు పైబడిన లేదా 40 శాతం అంగవైకల్యం ఉన్న అర్హులైన పౌరులు ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా హోమ్ ఓటింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. సదుపాయానికి ఓటర్ల నుంచి విశేష స్పందన లభించింది. చిరునవ్వులు చిందిస్తూ ఓటర్లు తమ ఇళ్ల నుంచి ఓటు వేసే దృశ్యాలు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి సోషల్ మీడియాలో ప్రాముఖ్యత పొందాయి.పోలింగ్ సిబ్బంది, భద్రతా సిబ్బంది సంపూర్ణ భాగస్వామ్యంతో ఓటింగ్ గోప్యత కు అనుగుణంగా హోం ఓటింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. ప్రక్రియను వీక్షించేందుకు అభ్యర్థుల ఏజెంట్లను కూడా పోలింగ్ బృందాల వెంట అనుమతించారు.

 

 

శ్రీమతి డి.పద్మావతి, కొవ్వూరు లోక్ సభ నియోజకవర్గం నుండి 100 సంవత్సరాలు, అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన సీనియర్ సిటిజన్ ఓటరు.

రాజస్థాన్ లోని చురులో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది దివ్యాంగులు గృహ ఓటింగ్ సదుపాయాన్ని పొందుతున్నారు.

అడ్డంకులను అధిగమించడానికిమెరుగైన భాగస్వామ్యం కోసం మౌలిక సదుపాయాల కల్పన

మౌలిక సదుపాయాల అంతరాలను పూడ్చడానికి, ప్రతి పోలింగ్ బూత్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండేలా, ర్యాంపులు, ఓటర్ల కోసం సైనేజీలు, పార్కింగ్ స్థలం, ప్రత్యేక క్యూలు, వాలంటీర్లతో సహా భరోసా సౌకర్యాలను కలిగి ఉండేలా ఇసిఐ చూసుకుంది. పోలింగ్ కేంద్రాల్లో వీల్ చైర్లు, పిక్ అండ్ డ్రాప్, వాలంటీర్ల సేవలు వంటి వివిధ సౌకర్యాలను పొందేందుకు ఇసిఐ కి చెందిన సాక్షం యాప్ దివ్యాంగుడికి అవకాశం కల్పించింది. ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచి ఇప్పటి వరకు 1.78 లక్షల మంది సాక్షం యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు.

దృష్టి లోపం ఉన్న ఓటర్లకు సహాయం చేయడానికి ఈవీఎంలపై బ్రెయిలీ, బ్రెయిలీ ఆధారిత ఎపిక్, ఓటర్ స్లిప్పులను కూడా కమిషన్ ఏర్పాట్లు చేసింది. అంతేకాక, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ల కోసం  పోలింగ్ రోజు సౌకర్యాలకు, రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించిన సమాచారంతో ఓటరు గైడ్ ను  ఇంగ్లిష్, హిందీ భాషలలో అందుబాటులో ఉంచారు.

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో 70 మంది వికలాంగ బాలికలకు ఓటు వేసేందుకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించారు.

 

PwD managed PS in J&K

 

Photos: Braille-coded voter cards distributed to visually impaired electors  | Hindustan Times   

బ్రెయిలీ ఆధారిత ఎపిక్, ఓటర్ గైడ్, బిహార్ లోని పోలింగ్ కేంద్రంలో వాలంటీర్, ఒడిశాలోని పోలింగ్ కేంద్రంలో షామియానా సదుపాయం

 

సమ్మిళితస్ఫూర్తి: ఓటు వేయడానికి మానసిక అడ్డంకులను తొలగించడం

ఓటు వేయడానికి భౌతిక అడ్డంకులను తొలగించడంతో పాటు, ట్రాన్స్జెండర్లు, సెక్స్ వర్కర్లు, పివిటిజిలు మొదలైన బలహీన జనాభా చుట్టూ ఉన్న సామాజిక అవరోధాలు, బలహీనతలను పరిష్కరించడానికి కూడా సి ప్రయత్నాలు చేసింది. పివిటిజిలు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేలా చూశారు. థర్డ్ జెండర్ (టిజి) ఓటర్లుసెక్స్ వర్కర్లు ,, పివిటిజిలు వంటి ఇతర అట్టడుగు వర్గాలను నమోదు చేయడానికి థానే జిల్లా పౌర సమాజం సహకారంతో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా 48,260 మంది టీజీలు నమోదు చేసుకోగా, వీరిలో తమిళనాడులో అత్యధికంగా 8467 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉండగా, ఉత్తరప్రదేశ్ లో 6628 మంది, మహారాష్ట్రలో 5720 మంది టీజీలు ఉన్నారు.

స్వీప్ కార్యక్రమాలలో భాగంగా, కమిషన్ 2024 మార్చి 16 ఐడిసిఎ (ఇండియన్ డెఫ్ క్రికెట్ అసోసియేషన్),  డిడిసిఎ (ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్) జట్ల మధ్య టి -20 క్రికెట్ మ్యాచ్ ను నిర్వహించింది.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/1BPQT.jpeg

టీ-20 మ్యాచ్ లో విజేతలకు ట్రోఫీ ప్రదానం చేసిన కమిషన్

ప్రతి ఏసీలో కనీసం ఒక పోలింగ్ కేంద్రాన్ని దివ్యాంగ అధికారులు నిర్వహించేలా ఏర్పాటు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం వీలైనంత వరకు ప్రయత్నాలు చేసింది. లోక్ సభ ఎన్నికలు -2024 కోసం దేశవ్యాప్తంగా సుమారు 2697 దివ్యాంగుల నిర్వహణ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఉత్తరప్రదేశ్ అత్యధికంగా 302 దివ్యాంగ నిర్వహణ  పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది.

 

బలహీన వర్గాలకు రిజిస్ట్రేషన్, ఓటింగ్ సులభతరం

అధిక ఎన్నికల భాగస్వామ్యాన్ని సాధించడంలో నిరాశ్రయులు, ఇతర సంచార సమూహాలు మరొక కీలకమైన జనాభా. వారి ప్రత్యేక పరిస్థితుల కారణంగా, వ్యక్తులు నివాస రుజువు లేకపోవడం వల్ల అనుకోకుండా ఎన్నికలలో పాల్గొనే అవకాశాలకు దూరం కావచ్చు. అయితే గత రెండేళ్లుగా వారిని ఓటర్లుగా నమోదు చేసుకోవడంతో పాటు ఓటింగ్ ప్రక్రియలో భాగస్వామ్యం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. గతంలో అందుబాటులో లేని ప్రాంతాల్లో కొత్త పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా పెద్ద ఎత్తున పీవీటీజీలను చేర్చారు.

పివిటిజిలు అధిక సంఖ్యలో నివసిస్తున్న అనేక రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలలో, పివిటిజిలు మారుమూల ప్రాంతాల నుండి పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడానికి ఉచిత రవాణా సౌకర్యాలను కల్పించారు. గ్రేట్ నికోబార్ లోని షోంపెన్ తెగ తొలిసారి లోక్ సభ ఎన్నికలు -2024లో ఓటు వేసింది.

భాగస్వామ్యాలు

ఎన్నికల అవగాహనను పెంపొందించడానికి , ఎన్నికలలో భాగస్వామ్యం, చేరిక స్ఫూర్తిని పెంపొందించడానికి, ఎన్నికల ప్రక్రియలో సమాజాన్ని మరింత నిమగ్నం చేయడానికి పదకొండు మంది దివ్యాంగ వ్యక్తులను "ఇసిఐ అంబాసిడర్లు" గా ఇసిఐ నియమించింది. ఎన్నికల్లో భాగస్వామ్యం, యాజమాన్య భావాన్ని పెంపొందించేందుకు దివ్యాంగుల ప్రత్యేక అవసరాలపై పోలింగ్ సిబ్బందికి శిక్షణ, అవగాహన కల్పించారు. దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసం రాష్ట్ర సిఇఒలు సంబంధిత రాష్ట్రాల వికలాంగుల, ఆరోగ్య శాఖలతో కలిసి పనిచేశారు.

మహిళా శిశు సంక్షేమం, ఆరోగ్య శాఖ సహకారంతో గ్యాంగ్ టక్ లో డి ఆధ్వర్యంలో శిబిరాలు

ఎన్నికల భాగస్వామ్యంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను బాగా అర్థం చేసుకోవడానికి, ఓటర్ల పట్ల క్షేత్ర యంత్రాంగాన్ని చైతన్యపరచడానికి , లోక్సభ ఎన్నికలు -2024 లో పాల్గొనేలా ఓటర్లను ప్రోత్సహించడానికి ఇసిఐ అధికారుల బృందం థానే జిల్లాలోనూ, , ముంబై నగరంలోని కామాటిపురాను సందర్శించింది.

థానే జిల్లాలోని ఎన్జీవోలు/సీఎస్ వోలు, టీజీ కమ్యూనిటీతో సమావేశమై లోక్ సభ ఎన్నికల్లో 100 శాతం పాల్గొనేలా వారిని ప్రోత్సహిస్తున్న  ఈసీఐ బృందం

 

లోక్ సభ ఎన్నికలు-2024లో ఓటు హక్కు వినియోగించుకునేలా దివ్యాంగ ఓటర్లను ప్రోత్సహించేందుకు అర్జున అవార్డు గ్రహీత, పారా ఆర్చర్ శ్రీమతి శీతల్ దేవిని ఈసీఐ నేషనల్ ఐకాన్ గా కమిషన్ నియమించింది. అలాగే, సి వివిధ ఓటరు అవగాహన కార్యక్రమాలలో పాల్గొనడానికి, దివ్యాంగ ఓటర్లను చేరుకోవడానికి పదకొండు మంది దివ్యాంగ ప్రముఖులను ఇసిఐ అంబాసిడర్లుగా నియమించారు. అంతేకాక, రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు స్టేట్ పిడబ్ల్యుడి ఐకాన్లను కూడా కమిషన్ నియమించింది.

https://www.newsonair.gov.in/wp-content/uploads/2024/03/para.jpg

శ్రీమతి శీతల్ దేవి, జాతీయ దివ్యాంగుల ఐకాన్, ఇసిఐ

    

 గుజరాత్ లోని మెహసానా జిల్లాలో దివ్యాంగులు వీల్ చైర్ ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు.

An extensive campaign including “Matdata appeal patra” was launched to enhance PVTG participation in the ongoing elections.

 

చివరి మైలు ఓటర్లకు చేరువ

ఒక్క ఓటరు కూడా వెనుకబడకుండా చూసేందుకుమారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న ఓటర్లకు చేరువయ్యేందుకు కమిషన్ నిబద్ధతతో ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఉదాహరణకు గుజరాత్ లోని అలియాబెట్ లో షిప్పింగ్ కంటైనర్ లో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రాంతంలో నివసిస్తున్న గిరిజన ఓటర్లను చేరుకున్నారు. అదేవిధంగా ఛత్తీస్ గఢ్ లోని బస్తర్, కాంకేర్ పీసీల్లోని 102 గ్రామాలకు చెందిన ఓటర్లు లోక్ సభ ఎన్నికల్లో తొలిసారిగా తమ సొంత గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

లద్దాఖ్ లేహ్ జిల్లాలోని వార్షి అనే మారుమూల గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి కోసం ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం

2024 సార్వత్రిక ఎన్నికల్లో కశ్మీరీ వలసదారులు ఓటు వేయడానికి వీలుగా జమ్మూ, ఉధంపూర్ లో నివసిస్తున్న లోయకు చెందిన నిర్వాసితులకు ఫారం-ఎం నింపే క్లిష్టమైన ప్రక్రియను ఈసీఐ రద్దు చేసింది. అదనంగా, జమ్మూ, ఉధంపూర్ వెలుపల నివసిస్తున్న వలసదారులకు (వారు ఫారం ఎం సమర్పించడానికి), ఫారం-ఎం తో జతచేయబడిన ధృవీకరణ పత్రం స్వీయ ధృవీకరణకు ఇసిఐ అధికారం ఇచ్చింది, తద్వారా గెజిటెడ్ అధికారి ద్వారా ధృవీకరించబడిన ఈ ధృవీకరణ పత్రాన్ని పొందే ఇబ్బంది తొలగిపోయింది. ఢిల్లీ, జమ్మూ, ఉధంపూర్ లోని వివిధ సహాయ శిబిరాల్లో నివసిస్తున్న కశ్మీరీ వలస ఓటర్లకు నిర్దేశిత ప్రత్యేక పోలింగ్ కేంద్రాల్లో వ్యక్తిగతంగా ఓటు వేసే లేదా పోస్టల్ బ్యాలెట్ ను ఉపయోగించే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. జమ్మూలో 21, ఉధంపూర్ లో 1, ఢిల్లీలో 4 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

  

ప్రత్యేక పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్న కశ్మీరీ వలసదారులు

అదేవిధంగా, మణిపూర్ లో అంతర్గతంగా నిర్వాసితులకు (ఐడిపి) ఓటు హక్కును నిర్ధారించడానికి, ఐడిపిల కోసం 10 జిల్లాల్లో 94 ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను (ఎస్ పిఎస్) ఏర్పాటు చేశారు. తెంగ్నౌపాల్ జిల్లాలో ఒకే ఓటరుకు ఒక ఎస్ పి ఎస్ ను ఏర్పాటు చేశారు. వెబ్ కాస్టింగ్/వీడియోగ్రఫీ కింద పోలింగ్ నిర్వహించారు. పునరావాస శిబిరాలకు వెలుపల ఉంటున్న నిర్వాసితులకు.కూడా ఎస్ పీఎస్ లో ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఇచ్చారు. 

  

మణిపూర్లో ప్రత్యేక పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఐడీపీ

 

***



(Release ID: 2022291) Visitor Counter : 740