భారత ఎన్నికల సంఘం

లోక్ సభ ఎన్నికలు 2024 లో భాగం గా ఏడో దశ లో పోలింగ్ జరుగనున్న 8 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల లో పోటీపడనున్న 904 మంది అభ్యర్థులు


ఏడో దశ లో పోలింగ్ జరుగనున్న 8 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల లో 57 పార్లమెంటరీ నియోజక వర్గాల కోసం దాఖలు అయిన 2105 నామినేశన్పత్రాలు

Posted On: 22 MAY 2024 1:15PM by PIB Hyderabad

లోక్ సభ ఎన్నికల ఏడో దశ లో భాగం గా 2024 జూన్ 1 వ తేదీ న 8 రాష్ట్రాల లో /కేంద్ర పాలిత ప్రాంతాల లో పోలింగ్ జరిగే 57 పార్లమెంటరీ నియోజక వర్గాల (పిసి స్) లో 904 మంది అభ్యర్థులు పోటీ చేయనున్నారు. ఆ 57 పార్లమెంటరీ నియోజక వర్గాల (పిసి స్) లో మొత్తం 2105 నామినేశన్ లు దాఖలు అయ్యాయి. నామినేశన్ ల దాఖలు కు 2024 మే 14 ఆఖరు తేదీ. దాఖలు అయిన అన్ని నామినేశన్ ల పరిశీలన తరువాత 954 నామినేశన్ లు చెల్లుబాటు అవుతాయి అని తేలింది.

 

 

ఏడో దశ లో , పంజాబ్ లో 13 పార్లమెంటరీ నియోజక వర్గాల కు గాను ఎక్కువ లో ఎక్కువ 598 నామినేశన్ లు చెల్లుబాటు అయ్యాయి. ఉత్తర్ ప్రదేశ్ లో 13 పిసి స్ కు 495 నామినేశన్ లు చెల్లుబాటు అయ్యాయి. బిహార్ లో 36-జహానాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం గరిష్ఠం గా 73 నామినేశన్ పత్రాల ను అందుకొంది; దీని తరువాత స్థానం లో పంజాబ్ లోని 7-లుధియానా పిసి ఉంది. అక్కడ 70 నామినేశన్ పత్రాలు చెల్లుబాటు అయ్యాయి. ఏడో దశ లో ఒక పార్లమెంటరీ నియోజక వర్గం లో బరిలో నిలచిన అభ్యర్థుల సగటు సంఖ్య ను చూస్తే, అది 16 గా ఉంది.

 

 

లోక్ సభ ఎన్నికలు 2024 లో భాగం గా ఏడో దశ లో పోలింగ్ జరుగనున్న రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతాల వారీ గా వివరాలు ఈ క్రింది పట్టిక లో తెలిపిన విధంగా ఉన్నాయి:

 

 

క్రమ సంఖ్య

రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతం

7వ దశ లో పిసి స్ సంఖ్య

నామినేశన్ ఫారాల స్వీకరణ

పరిశీలన తరువాత చెల్లుబాటు అయిన నామినేశన్ లు

ఉపసంహరణ అనంతరం తుదిగా పోటీలో ఉన్న అభ్యర్థులు

 

 

 

 

1

బిహార్

8

372

138

134

 

 

2

చండీగఢ్

1

33

20

19

 

 

3

హిమాచల్ ప్రదేశ్

4

80

40

37

 

 

4

ఝార్‌ ఖండ్

3

153

55

52

 

 

5

ఒడిశా

6

159

69

66

 

 

6

పంజాబ్

13

598

353

328

 

 

7

ఉత్తర్ ప్రదేశ్

13

495

150

144

 

 

8

పశ్చిమ బంగాల్

9

215

129

124

 

 

 

మొత్తం

57

2105

954

904

 

 

 

 

***



(Release ID: 2021334) Visitor Counter : 147