భారత ఎన్నికల సంఘం

వెనుకటి ఎనిమిది లోక్ సభ ఎన్నికల లో అన్నిటికంటేఎక్కువ పోలింగు దిశ గా పయనిస్తున్న బారామూలా;   సాయంత్రం 5 గంటల వేళ వరకు రికార్డు స్థాయి లో 54.21 శాతం పోలింగ్


జమ్ము, కశ్మీర్లో శాంతిభరితమైన మరియు భద్రతయుక్తమైన వాతావరణం లో ఉదయం నుండే వోటులను వేయడానికిబారులు తీరిన వోటరు లు 

Posted On: 20 MAY 2024 8:12PM by PIB Hyderabad

కేంద్ర పాలిత ప్రాంతం జమ్ము, కశ్మీర్ లోని శ్రీనగర్ పార్లమెంటరీ నియోజక వర్గం (పిసి) లో రికార్డు స్థాయి లో 38.49 శాతం వోటు లు పడ్డ తరువాత, ఇక బారామూలా పార్లమెంటరీ నియోజక వర్గం వెనుకటి ఎనిమిది లోక్ సభ ఎన్నికల లో అత్యంత అధిక పోలింగ్ దిశ గా పయనిస్తోందా అన్న సంకేతాల ను వెలువరిస్తున్నది. బారామూలా, కుప్‌ వాడా, బాందీపోరా మరియు బడ్‌గామ్ జిల్లాల లో సాయంత్రం పూట 5 గంటల వేళ వరకు 54.21 శాతం వోటు లు పడ్డాయి.

 

 

ఎన్నికలు సాఫీ గాను, శాంతియుక్తం గాను నిర్వహించినందుకు ఇటు పౌర అధికారులు మరియు భద్రత సిబ్బంది యొక్క ప్రయాసల ను ప్రశంసిస్తూ, జమ్ము, కశ్మీర్ వోటరులు ఉత్సాహం గా పాలుపంచుకొని, వోటుల ను వేసినందుకు గాను ఎన్నికల సంఘం ప్రధాన అధికారి శ్రీ రాజీవ్ కుమార్ తోటి ఎన్నికల కమిశనర్ లు శ్రీయుతులు జ్ఞానేశ్ కుమార్, సుఖ్‌బీర్ సింహ్ లతో కలసి వారికి ధన్యవాదాల ను తెలియ జేస్తూ జమ్ము, కశ్మీర్ ప్రజలు వారి యొక్క వోటు హక్కు ను వినియోగించుకోవడం మరియు పాలన తాలూకు ప్రజాస్వామిక వ్యవస్థ లో వారి వంతు పాత్ర ను పోషించాలనే కోరిక తో ఉన్నారన్న స్పష్టమైన సందేశాన్ని ఇచ్చరు అని పేర్కొన్నారు.

 

 

 

 

బారామూలా పార్లమెంటరీ నియోజక వర్గం లో 2103 పోలింగ్ కేంద్రాల లో వోటుల ను వేయడమైంది. పోలింగ్ కేంద్రాల లో వెబ్ కాస్టింగ్ ద్వారా వోటుల ను నమోదు చేయడమైంది. నియోజకవర్గం లో ఉదయం 7 గంటలకు పోలింగు మొదలైంది. ఉత్సాహులైన వోటరు లు చేంతాడంత బారుల లో నిలబడి వారి వంతు ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వోటు వేస్తామా అన్నట్టు వేచి ఉండడం కనిపించింది.

 

 

గడచిన కొన్ని ఎన్నికల లో మొత్తం వోటింగు

 

పిసి/సంవత్సరం

2019

2014

2009

2004

1999

1998

1996

1989

బారామూలా

34.6%

39.14%

41.84%

35.65%

27.79%

41.94%

46.65%

5.48%

శ్రీనగర్

14.43%

25.86%

25.55%

18.57%

11.93%

30.06%

40.94%

Uncontested

 

 

ప్రస్తుతం జరుగుతున్న సాధారణ ఎన్నికలు 2024 లో బారామూలా పార్లమెంటరీ నియోజకవర్గం (పిసి) లో 22 మంది అభ్యర్థులు బరి లో నిలచారు. పోలింగ్ కేంద్రాల లో నిశ్చింతత, శాంతి మరియు ఉత్సవాన్ని పోలినటువంటి వాతావరణం లో వోటరుల కు స్వాగతం పలకాలని భద్రత సిబ్బంది తో పాటు పోలింగ్ సిబ్బంది అవిరళం గా శ్రమించారు. దిల్లీ, జమ్ము మరియు ఉధమ్‌ పుర్ లలో వేరువేరు ఉపశమన శిబిరాల లో తల దాచుకొంటున్న కశ్మీరీ ప్రవాసి వోటరు లు సైతం నిర్దిష్ట ప్రత్యేక పోలింగ్ కేంద్రాల లో స్వయం గా హాజరు అయ్యి గాని లేదా పోస్టల్ బ్యాలట్ ను వినియోగించుకొని గాని వోటు ను వేయడం కోసం ఎన్నికల సంఘం వీలు కల్పించింది. జమ్ము లో 21 ప్రత్యేక పోలింగ్ కేంద్రాల ను, ఉధమ్‌ పుర్ లో ఒక కేంద్రాన్ని, దిల్లీ లో నాలుగు పోలింగ్ కేంద్రాల ను ఏర్పాటు చేయడమైంది.

 

 

 

జమ్ము, ఉధమ్ పుర్ మరియు దిల్లీ లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలింగ్ కేంద్రాల వద్ద ప్రవాసీ వోటరులు

 

ఇంతకు ముందు, నాలుగో దశ లో, శ్రీనగర్ పార్లమెంటరీ నియోజకవర్గం లో శ్రీనగర్, గాందర్‌బల్, పుల్‌వామా, బడ్‌గామ్ మరియు శోపియాఁ జిల్లాల ను పాక్షికం గా కవర్ చేస్తూ 38.49 శాతం పోలింగు నమోదు అయింది; అది అనేక దశాబ్దాల లో అత్యధికం గా ఉండింది. 370 వ అధికరణం రద్దు మరియు జమ్ము- కశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ చట్టం, 2019 అమలు అయిన తరువాత లోయ లో ఇవే మొదటి సాధారణ ఎన్నికలు.

 

 

 

***



(Release ID: 2021261) Visitor Counter : 54