భారత ఎన్నికల సంఘం

రేపటి రోజు న జరుగనున్న అయిదో దశ పోలింగు కు అన్నిఏర్పాటులను పూర్తి చేయడమైంది


రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు ఎనిమిదింటి పరిధి లోని49 లోక్ సభ స్థానాల లో94 వేల కు పైగాపోలింగ్ కేంద్రాల లో 8.95 కోట్ల మంది వోటరు లు వారి వోటుల ను వేయనున్నారు

ఒడిశా లోని 35 అసెంబ్లీ నియోజక వర్గాల లోనూ పోలింగ్

Posted On: 19 MAY 2024 1:31PM by PIB Hyderabad

రేపటి రోజు (2024 మే 20వ తేదీ)న జరిగే లోక్ సభ ఎన్నికల యొక్క అయిదో దశ కోసం భారత ఎన్నికల సంఘం (ఇసిఐ) సర్వ సన్నద్ధం అయింది. రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు ఎనిమిదింటి పరిధి లోని 49 పార్లమెంటు నియోజక వర్గాల లో పోలింగు జరుగనుంది. ఒడిశా విధాన సభ కు చెందిన 35 విధాన సభ నియోజక వర్గాల కు కూడా పోలింగ్ జరుగనుంది. పోలింగ్ కేంద్రాల లో వోటరు ల సౌకర్యార్థం ఎండ పొడ పడకుండా ఏర్పాటు లు, త్రాగునీరు, ర్యాంపు లు, టాయిలెట్ లు తదితర ప్రాథమిక సౌకర్యాల ను సమకూర్చి, పోలింగ్ సురక్షిత వాతావరణం లోను, సౌకర్యవంతం గాను జరిగేటట్లుగా చర్యల ను తీసుకోవడమైంది. ఎండ వేడిమి ఎక్కువ గా ఉండవచ్చన్న అంచనా లు వెలువడిన ప్రాంతాల లో తగిన రక్షణ ఏర్పాటుల ను తీసుకోవలసిందంటూ సంబంధిత సిఇఒ లకు/డిఇఒ లకు మరియు ప్రభుత్వ పాలన యంత్రాంగాల కు సూచనల ను చేయడమైంది. యంత్రాలు మరియు ఇతర సామగ్రి తో సహా పోలింగ్ బృందాల ను పోలింగ్ కేంద్రాల కు పంపించడమైంది. పెద్ద సంఖ్యల లో తరలివచ్చి పోలింగ్ కేంద్రాల లో బాధ్యతాయుక్తం గాను, సగర్వం గాను వోటు హక్కు ను వినియోగించుకోవాలని వోటరుల కు ఎన్నికల సంఘం పిలుపు ను ఇచ్చింది.

 

పెద్ద సంఖ్యల లో వచ్చి పోలింగ్ కేంద్రాల లో బాధ్యతాయుక్తం గాను, సగర్వం గాను వోటు హక్కు ను వినియోగించుకోవాలంటూ వోటరుల కు ఎన్నికల సంఘం పిలుపు ను ఇచ్చింది. ఇంతవరకు, పోలింగ్ ముగిసిన లోక్ సభ ఎన్నికలు 2024 లో పోలింగ్ కేంద్రాల కు తరలి వచ్చిన వోటరు లు వేసిన వోటులు దాదాపు 66.95 శాతం ఉన్నాయని లెక్క కట్టడమైంది. ప్రస్తుతం సాగుతున్న సాధారణ ఎన్నికల లో మొదటి నాలుగు దశల లో సుమారు 451 మిలియన్ మంది ఈ సరికే వోట్ లను వేశారు.

 

 

అయిదో దశ లో పోలింగ్ ప్రక్రియ కొనసాగనున్న రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు ఎనిమిదింటి పరిధి లో బిహార్, జమ్ము- కశ్మీర్, లద్దాఖ్, ఝార్‌ ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉతర్ ప్రదేశ్ మరియు పశ్చిమ బంగాల్ లు ఉన్నాయి. నగరాల వారీ గా చూసినప్పుడు ముంబయి, ఠాణె, లఖ్‌నవూ లు ప్రస్తుత దశ లో పోలింగ్ చోటు చేసుకోనున్న నగర ప్రాంతాల లో ఉన్నాయి. నగర ప్రాంతాల నివాసుల లో మునుపు వోటింగ్ పట్ల నిరాసక్తత వ్యక్తం అయింది. నగర ప్రాంతాల లో నివాసం ఉండే వారు అధిక సంఖ్యల లో వోటు వేయడాని కి విచ్చేసి ఈ మచ్చ ను మాపాలి అని ఎన్నికల సంఘం ప్రత్యేకం గా విజ్ఞప్తి చేసింది.

 

 

వోటరు లు ప్రస్తుత ఎన్నికల లో వారి వోటు ను వేసేందుకు వారి కి ప్రేరణ ను ఇవ్వడం కోసం, అలాగ వారికి విన్నపాలను చేయడం కోసం అనేక మంది ప్రముఖ వ్యక్తుల తో ఇసిఐ భాగస్వామ్యం వహించింది. కాబట్టి, మీకు ఒక క్రికెట్ దిగ్గజం మరియు ఇసిఐ తో అనుబంధం కలిగినటువంటి జాతీయ ప్రముఖ వ్యక్తుల లో ఒకరు అయిన శ్రీ సచిన్ తెందుల్కర్ నుండి మీ యొక్క వోటు ను తప్పక వేయగలరుఅనే విజ్ఞప్తి ని చేస్తూ ఒక ఫోన్ కాల్ మీకు వచ్చినా మీరు ఆశ్చర్యపోనక్కర లేదు !.

 

 

ఎన్నికల లో మిగిలిన మూడు దశల పోలింగ్ జూన్ ఒకటో తేదీ వరకు కొనసాగనుంది. వోటు ల లెక్కింపు ను జూన్ 4 వ తేదీ నాడు చేపట్టనున్నారు. సాధారణ ఎన్నికల మొదటి నాలుగు దశల లో భాగం గా రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు ఇరవైమూడింటి పరిధి లో 379 పార్లమెంటరీ నియోజక వర్గాల (పిసి స్) లో పోలింగ్ ప్రశాంతం గా మరియు సాఫీ గా ముగిసింది.

 

 

అయిదో దశ యొక్క వాస్తవాలు:

 

1. సాధారణ ఎన్నికలు 2024 లో భాగం గా అయిదో దశ కోసం పోలింగ్ 49 పార్లమెంటరీ నియోజక వర్గాల లో 2024 మే 20 వ తేదీ నాడు జరుగనుంది . (వాటిలో 39 జనరల్ స్థానాలు; 3-ఎస్‌టి స్థానాలు; 7 ఎస్‌సి స్థానాల లు ఉన్నాయి.) పోలింగు ఉదయం పూట 7 గంటల కు మొదలై సాయంత్రం పూట 6 గంటల కు ముగియనుంది. (పార్లమెంటరీ నియోజక వర్గాల వారీగా పోలింగ్ సమయాల ముగింపు వేరు వేరు గా ఉండే సూచనలు ఉన్నాయి).

 

2. ఒడిశా లో 35 అసెంబ్లీ నియోజక వర్గాల కు కూడాను పోలింగు జరుగనుంది. ఈ నియోజక వర్గాల లో జనరల్ నియోజకవర్గాలు 21; ఎస్‌టి జనరల్ నియోజకవర్గాలు 8; ఎస్‌సి జనరల్ నియోజకవర్గాలు 6 ఉన్నాయి.

 

3. 94,732 పోలింగ్ కేంద్రాల లో 8.95 కోట్ల మంది వోటరుల చేత సుమారు 9.47 లక్షల మంది పోలింగ్ అధికారులు వోటు ను వేయించనున్నారు.

 

4. 8.95 కోట్ల కు పైగా వోటరు లలో పురుషులు 4.69 కోట్లు; మహిళలు 4.26 కోట్లు ఉండగా; థర్డ్ జెండర్ వోటరు లు 5,409 మంది ఉన్నారు.

5. వోటరుల లో 85 సంవత్సరాల కు మించిన వయస్సు కలిగిన వారు 7.81 లక్షల కు పైచిలుకు, 100 ఏళ్ళ వయస్సు మించిపోయిన వోటరులు 24,792 మంది, దివ్యాంగ వ్యక్తులు 7.03 లక్షల మంది ఉన్నారు. వీరికి ఇంటి వద్దే వోటు హక్కు ను వినియోగించుకొనే ఐచ్చికాన్ని ఇవ్వడమైంది. ఇంటి వద్దే వోటు వేసే ఐచ్ఛిక సదుపాయాని కి ఈసరికే అద్భుతమైన ప్రతిస్పందన మరియు ప్రశంస లు ప్రాప్తం అయ్యాయి.

6. పోలింగ్ సిబ్బంది ని మరియు భద్రత సిబ్బంది ని 17 ప్రత్యేక రైళ్ళ లో మరియు 508 హెలికాప్టర్ లలో తీసుకు పోవడమైంది.

 

7. కాగా, 153 మంది పరిశీలకులు (55 మంది సాధారణ పరిశీలకులు, 30 మంది పోలీసు విభాగం పరిశీలకులు, 68 మంది వ్యయ సంబంధి పరిశీలకులు) వారి పోలింగ్ తేదీ కంటే కొద్ది రోజుల ముందు గానే వారికి నిర్దేశించిన నియోజకవర్గాల కు చేరుకొన్నారు. వారు ఎన్నికల ప్రక్రియ పై ఎన్నికల సంఘం అత్యంత నిఘా ను వేయడం లో దోహద పడనున్నారు. ఇంకా, కొన్ని రాష్ట్రాల లో ప్రత్యేక పరిశీలకుల ను కూడా రంగం లోకి దింపడమైంది.

 

8. వోటరుల ను ఏ రూపం లో అయినా ప్రలోభ పెట్టడం వంటి విషయాల ను ఎప్పటికప్పుడు అప్రమత్తం గా గమనించడం కోసం 2,000 ఫ్లయింగ్ స్క్వాడ్ లు, 2105 నిఘా బృందాలు, 881 వీడియో పర్యవేక్షణ బృందాలు మరియు 502 వీడియో వీక్షణ బృందాలు విధుల ను నిర్వర్తిస్తున్నాయి.

 

9. 216 అంతర్జాతీయ సరిహద్దు పరీక్షా స్థలాలు మరియు 565 అంతర్ రాష్ట్ర సరిహద్దు పరీక్షాస్థలాలు రంగ ప్రవేశం చేసి మద్యం, మత్తు పదార్థాలు, నగదు, ఇంకా ఉచిత కానుకలు వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు కొనసాగకుండా గట్టి పహారా ను కాస్తున్నాయి. సముద్ర మార్గం లో మరియు వాయు మార్గం లో సైతం కచ్చితమైన నిఘా ను ఉంచుతున్నారు.

 

10. వయో వృద్ధులు మరియు దివ్యాంగులు సహా ప్రతి ఒక్క వోటరు వారి వోటు ను సులభమైన పద్ధతి లో వేసేటట్లుగా చూడడం కోసం త్రాగునీరు, ఎండ నుండి రక్షణ కోసం షెడ్డు, టాయిలెట్ లు, ర్యాంపులు, స్వచ్ఛంద సేవకులు, నాలుగు చక్రాల కుర్చీలు మరియు విద్యుత్తు సదుపాయం వంటి వాటిని సమకూర్చడమైంది.

11. పేరుల ను నమోదు చేసుకొన్న వోటరు లు అందరికి వోటరు సమాచారం చీటీల ను ఇవ్వడమైంది. ఈ చీటీల తో పాటు, ఇంటి బయట కు వచ్చి వోటు చేయవలసింది అంటూ ఒక ఆహ్వానాన్ని కూడా ఎన్నిక సంఘం ద్వారా పంపిణీ చేయడమైంది.

 

12. వోటరు లు https://electoralsearch.eci.gov.in/ ను సందర్శించి, వారి యొక్క పోలింగ్ కేంద్రం వివరాల ను మరియు పోలింగ్ తేదీ ని తెలుసుకోవచ్చును.

13. పోలింగ్ కేంద్రాల లో గుర్తింపు ను తనిఖీ చేయడం కోసం వోటర్ ఐడి కార్డ్ (ఇపిఐసి) కాకుండా మరో 12 ప్రత్యామ్నాయ డాక్యుమెంట్ లను కూడా ఎన్నికల సంఘం వెల్లడించింది. ఒక వోటరు జాబితా లో ఒక వోటరు అతడి లేదా ఆమె పేరు ను నమోదు చేసుకొని ఉన్నట్లయితే, ఈ డాక్యుమెంటులలో ఏదైనా ఒక దానిని చూపడం ద్వారా వోటు ను వేయవచ్చును. ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాల కోసం ఈ క్రింద ఇచ్చిన ఇసిఐ ఉత్తర్వు లింకు ను చూడగలరు:

https://www.eci.gov.in/eci-backend/public/api/download?

 

14. అయిదో దశ లో పార్లమెంటరీ నియోజకవర్గం వారీ ఓటరుల యొక్క సమాచారాన్ని 2024 మే నెల 17 వ తేదీ నాటి 89 వ నంబరు పత్రికా ప్రకటన మాధ్యం ద్వారా పేర్కొనడమైంది.

 

15. 2019 లోక్ సభ సాధారణ ఎన్నికల లో వోటరు శాతం సంబంధి సమాచారాన్ని ఈ దిగువన ఇచ్చిన లింక్ https://old.eci.gov.in/files/file/13579-13-pc-wise-voters-turn-out/ లో పొందవచ్చును.

 

16. ప్రతి ఒక దశ లో సమగ్రం గా ఎంత శాతం వోటింగ్ జరుగుతున్నదో వోటర్ టర్న్అవుట్ ఏప్ స్థూలం గా తెలియజేస్తుంది. పోలింగ్ రోజు న రాత్రి 7 గంటల వరకు ప్రతి రెండు గంటల కు ఒకసారి చొప్పున దశల వారీగా/రాష్ట్రాల వారీగా/ఎసి వారీగా/పిసి వారీగా ఎన్ని వోట్లు పడుతున్నాయి అనే సమాచారాన్ని వోటర్ టర్న్అవుట్ ఏప్ లో తెలుసుకోవచ్చును. రాత్రి 7 గంటల తరువాత పోలింగ్ పార్టీలు సంబంధి ప్రధాన కేంద్రానికి చేరుకొన్నప్పుడు ఈ సమాచారాన్ని తాజా పరచి వెల్లడించడం జరుగుతుంది.

 

 

***



(Release ID: 2021133) Visitor Counter : 35